News March 1, 2025
నంద్యాల జిల్లాలో 50% పంపిణీ పూర్తి

నంద్యాల జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వం ఆదేశాలతో తొలిసారిగా ఉదయం 7 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. ఉ.9:30 గంటలకు నంద్యాల జిల్లాలో 59.41% పింఛన్ల పంపిణీ పూర్తయింది. కాగా, ఇప్పటివరకు జిల్లాలో 2,15,031 మందికి గానూ 1,27,746 మందికి సచివాలయ ఉద్యోగులు పింఛన్ సొమ్మును అందజేశారు.
Similar News
News December 14, 2025
ధర్మసాగర్: సర్పంచులు వీరే!

ధర్మసాగర్ మండలం ధర్మపురంలో BRS బలపరిచిన అభ్యర్థి రమాదేవి విజయం సాధించారు. అలాగే దేవునూరు గ్రామంలో BRS బలపరిచిన అభ్యర్థి ఇంగె రవి గులాబీ జెండా ఎగరేశారు. మరోవైపు కరుణాపురంలో సైతం గులాబీ జెండా ఎగిరింది. ఇక్కడ BRS బలపరిచిన అభ్యర్థి గుర్రపు రీనా గెలుపు ముంగిట నిలిచారు. కడియం శ్రీహరి నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ గ్రామాల్లో గులాబీ జెండా ఎగరడం పట్ల BRS నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News December 14, 2025
ఎన్టీఆర్: రేపు పోలీస్ గ్రివెన్స్ రద్దు

విజయవాడ పోలీసులు కీలక ప్రకటన చేశారు. సోమవారం జరగాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. పోలీస్ అధికార యంత్రాంగం భవాని ఉత్సవాల విరమణ కార్యక్రమంలో ఉన్నందున ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. కావున ప్రజలందరూ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్‌కు ఫిర్యాదులు నిమిత్తం రావద్దని సూచించారు.
News December 14, 2025
సీసీ కుంట నూతన సర్పంచులు వీరే !

అల్లిపూర్ శారదమ్మ
అమ్మాపూర్ – రంజిత్ కుమార్
బండార్ పల్లి – బత్తుల సుజాత
వడ్డేమాన్ – స్వప్న
సీసీ కుంట మానస – దమాగ్నాపూర్ పావని
ఏదులాపూర్ – ఆంజనేయులు
ఫర్దిపూర్ – శివకుమార్
గోప్య నాయక్ తండా – రాములు
గూడూరు – భీమన్న
లాల్ కోట – గోపాల్
మద్దూరు – దామోదర్
నెల్లికొండి – సుకన్య
పల్లమర్రి – లక్ష్మీ
సీతారాంపేట – హుస్సేన్ జీ
ఉంద్యాల -ఆంజనేయులు.


