News April 1, 2025
నంద్యాల జిల్లాలో 67.02% పింఛన్ల పంపిణీ @9:45Am

నంద్యాల జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించి మంగళవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వం ఆదేశాలతో ఉదయం 7 గంటల నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. ఉదయం 9:45 గంటలకు జిల్లాలో 67.02% పింఛన్ల పంపిణీ పూర్తయింది. ఇప్పటివరకు జిల్లాలో 2,14,590 మందికి గానూ 1,43,822 మందికి సచివాలయ ఉద్యోగులు పింఛన్ సొమ్మును అందజేశారు.
Similar News
News December 26, 2025
అడవి శ్రీరాంపూర్‌లో గర్భిణి ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో గురువారం రాత్రి ఐదు నెలల గర్భిణి అంజలి (21) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎనిమిది నెలల క్రితం వివాహమైన ఆమెను వరకట్నం పేరుతో భర్త, అత్తింటివారు వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వేధింపులు తాళలేక పుట్టింట్లో ఉంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 26, 2025
NZB: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా

నిజామాబాద్‌లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ఓ కిలాడి లేడీ టోకరా వేసింది. ఏకంగా కలెక్టర్, సివిల్ సప్లై కమిషనర్, ఆర్‌అండ్‌బీ సీఈ సంతకాలు ఫోర్జరీ చేసి నియామక పత్రాలు సృష్టించింది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ల నియామకం పేరుతో ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసింది. నియామక పత్రాలు నకిలీవని తేలడంతో బాధితులు మూడో టౌన్ పోలీసులను ఆశ్రయించారు.
News December 26, 2025
విశాఖ: నకిలీ డాక్టర్‌గా చలామణీ అవుతున్న కేటుగాడి అరెస్ట్ (1/2)

నకిలీ వైద్యుడి అవతారమెత్తి ప్రజలను మోసం చేస్తున్న జ్యోతి శివశ్రీ అలియాస్ నరసింహంను పోలీసులు అరెస్ట్ చేశారు. కేజీహెచ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇతడిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బీటెక్ చదివి కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడు, గతంలో 33 నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఇతడి నుంచి రూ. 30 వేల నగదు, స్టెతస్కోప్, వైట్ అప్రాన్ స్వాధీనం చేసుకున్నారు.


