News December 31, 2025

నంద్యాల జిల్లాలో 93.86 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

image

నంద్యాల జిల్లాలో జనవరి నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పథకం కింద తొలి రోజు బుధవారం పింఛన్ల పంపిణీ ముగిసింది. సచివాలయ ఉద్యోగులు ఉదయం 7 నుంచే పింఛన్ల పంపిణీ చేపట్టారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి జిల్లాలో 93.86శాతం పంపిణీ పూర్తయింది. ఇప్పటివరకు 2,13,630 మందికి గాను 2,00,520 మందికి పింఛన్లు అందజేశారు.

Similar News

News February 14, 2026

కిరండూల్ ప్యాసింజర్ రైళ్ల దారి మళ్లింపు

image

వాల్తేరు డివిజన్ కేకే లైన్లో ఆధునీకీకరణ పనుల కారణంగా విశాఖపట్నం-కిరండూల్ (58501) ప్యాసింజర్ ఈ నెల 16 నుంచి 27 వరకు దంతేవాడ వరకే నడువనుంది. తిరుగు ప్రయాణంలో కిరండూల్-విశాఖపట్నం (58502) రైలు 17 నుంచి 28 వరకు కిరండూల్‌కు బదులుగా దంతేవాడ నుంచే ప్రారంభమవుతుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని రైల్వే శాఖ కోరింది.

News February 14, 2026

NZB: ఓడిన మాజీ మేయర్ కుటుంబీకులు

image

మొన్నటి వరకు నిజామాబాద్ మేయర్‌గా ఉన్న దండు నీతూ కిరణ్(BRS) కుటుంబీకులు ఇద్దరూ ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోయారు. దండు నీతూ కిరణ్ భర్త దండు చంద్రశేఖర్ ఈ ఎన్నికల్లో BRS తరఫున 8వ డివిజన్ నుంచి, 21వ డివిజన్ నుంచి ఆయన కూతురు దండు రుషిత పోటీలో నిలబడ్డారు. అయితే ప్రజా తీర్పులో తండ్రీ కూతుర్లు ఇద్దరూ ఓటమి చెందారు.

News February 14, 2026

కరివేపాకుతో మెరిసే చర్మం

image

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీమైక్రోబయల్ వంటి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు, చర్మాన్ని మెరిసేలా చేస్తాయని నిపుణులంటున్నారు. * కరివేపాకు, పాలతో చేసిన పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల మచ్చలు, ముడతలు తగ్గుతాయి. * కరివేపాకు మరిగించిన నీళ్లలో కొద్దిగా శనగపిండి, నిమ్మరసం కలిపి కూడా ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరుస్తుంది.