News December 18, 2025

నంద్యాల జిల్లా ఇంఛార్జ్‌గా సీహెచ్ శ్రీధర్

image

రాష్ట్రంలోని 5 జిల్లాలకు జిల్లా ఇంఛార్జ్‌లుగా సీనియర్ IAS అధికారులను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల జిల్లా ఇంఛార్జ్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి సీహెచ్ శ్రీధర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లాలోని అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాల అమలు తీరును ఈయన స్వయంగా పర్యవేక్షించనున్నారు.

Similar News

News December 21, 2025

టీడీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు వీరే..!

image

టీడీపీ లోక్‌సభ నియోజకవర్గ(జిల్లా) అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. కర్నూలు లోక్‌సభ అధ్యక్షురాలిగా గుడిసె కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు యాదవ్‌ను నియమించారు. నంద్యాల లోక్‌సభ అధ్యక్షురాలిగా గౌరు చరితా రెడ్డి, ప్రధాక కార్యదర్శిగా ఎన్ఎండీ ఫిరోజ్‌ను నియమించారు.

News December 21, 2025

ప్రకాశం జిల్లా TDP అధ్యక్షుడిగా ఉగ్ర నరసింహారెడ్డి

image

ప్రకాశం జిల్లా TDP అధ్యక్షుడిగా కనిగిరి MLA ఉగ్ర నరసింహారెడ్డిని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. దీంతో కనిగిరిలో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎప్పటి నుంచో సీఎం చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా పట్టి జిల్లాలో TDPకి పునర్వైభవానికి తీసుకొచ్చారని పార్టీ శ్రేణులు చెప్పుకొచ్చారు.

News December 21, 2025

అనంత, హిందూపురం లోక్‌సభ టీడీపీ అధ్యక్షులు వీరే..!

image

టీడీపీ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. అనంతపురం లోక్‌సభ అధ్యక్షుడిగా పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా జి.శ్రీధర్ చౌదరిని నియమించారు. హిందూపురం లోక్‌సభ అధ్యక్షుడిగా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ప్రధాక కార్యదర్శిగా హనుమప్పను నియమించారు.