News February 19, 2025
నంద్యాల జిల్లా టాప్ న్యూస్

➤ ఈ నెల 23-26 వరకు మల్లన్న ప్రసాదం ఉచితం: శ్రీశైలం ఈవో➤ క్రికెట్ ఆడిన మంత్రి బీసీ➤ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి➤ మహాశివరాత్రి ఉత్సవాలకు భారీ బందోబస్తు: నంద్యాల ఏఎస్పీ ➤ గ్రామాల అభివృద్ధికి కృషి: డోన్ ఎమ్మెల్యే➤ గండ్లేరులో చేప పిల్లలు వదిలిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే➤ జిల్లాలో కొనసాగిన రుణాల దరఖాస్తులకు వెరిఫికేషన్ ప్రక్రియ➤ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లకు జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం
Similar News
News December 16, 2025
15 బంతుల్లో హాఫ్ సెంచరీ..

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ మరోసారి చెలరేగారు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. మొత్తంగా 22 బంతుల్లో 73 రన్స్ బాదారు. ఇందులో 7 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. తొలుత రాజస్థాన్ 216/4 స్కోర్ చేయగా, ముంబై 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మరో బ్యాటర్ రహానే 41 బంతుల్లో 72* రన్స్ చేశారు.
News December 16, 2025
మెస్సీ టూర్లో ‘బెస్ట్ సెల్ఫీ’.. నెట్టింట ప్రశంసలు!

GOAT టూర్లో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో ఫొటో దిగేందుకు సెలబ్రిటీలు పోటీ పడగా ఓ స్పెషల్ సెల్ఫీ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పర్యటనలో తమకు రక్షణగా ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్‌కు మెస్సీతో పాటు రోడ్రిగో డిపాల్, సువారెజ్ స్వయంగా కారులో సెల్ఫీ ఇచ్చారు. స్టార్ ప్లేయర్స్ అందరూ నవ్వుతూ ఇచ్చిన ఈ ఫోటోను ‘బెస్ట్ సెల్ఫీ’ అని నెటిజన్లు కొనియాడుతున్నారు. వారి నిరాడంబరతను ప్రశంసిస్తున్నారు.
News December 16, 2025
MBNR: సౌత్ జోన్.. ఈనెల 19న టేబుల్ టెన్నిస్ ఎంపికలు

మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు వర్సిటీ నుంచి సౌత్ జోన్ ఆలిండియా టేబుల్ టెన్నిస్ పోటీల్లో పాల్గొనే జట్ల ఎంపికలను ఈ నెల 19న నిర్వహించనున్నట్లు వర్సిటీ పీడీ డా. వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. వయస్సు 17-25 ఏళ్లలోపు ఉండాలని, క్రీడాకారులు బోనఫైడ్, టెన్త్ మెమో, ప్రిన్సిపల్ సంతకంతో కూడిన ఎలిజిబిలిటీ ఫామ్ తీసుకురావాలన్నారు. ఎంపికలు యూనివర్సిటీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉంటాయన్నారు.


