News February 26, 2026

నంద్యాల జిల్లా నేతలకు మంత్రి లోకేశ్ విందు

image

ఉండవల్లి నివాసంలో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ కూటమి ప్రజాప్రతినిధులకు మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరితో పాటు డోన్, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, నంద్యాల, నందికొట్కూరు, పాణ్యం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నియోజకవర్గాల అభివృద్ధిపై చర్చించిన అనంతరం, మంత్రి వారికి మంగళగిరి పట్టుచీరలను బహూకరించారు. అందరూ కలిసి మంత్రి ఆతిథ్యాన్ని స్వీకరించారు.

Similar News

News February 26, 2026

ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ బదిలీ

image

ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి బదిలీ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయనను వికారాబాద్ జిల్లాకు బదిలీ చేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఆసిఫాబాద్‌లో తన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసిన ఆయన, త్వరలోనే వికారాబాద్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.

News February 26, 2026

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా అంకిత్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్‌గా అంకిత్ ఐఏఎస్ నియమితులయ్యారు. నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన అంకిత్‌ను భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ టీజీ ఎన్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.

News February 26, 2026

మెదక్ కలెక్టర్‌గా ప్రతిమా సింగ్

image

మెదక్ జిల్లాకు నూతన కలెక్టర్‌గా ప్రతిమ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కలెక్టర్‌గా ఉన్న రాహుల్ రాజ్‌ను సహకార శాఖకు బదిలీ చేశారు. ప్రతిమా సింగ్ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. కలెక్టర్‌గా పదోన్నతితో మెదక్ జిల్లాకు బదిలీ అయ్యారు. ప్రతిమా సింగ్ గతంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.