News April 12, 2025
నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవియన్స్

నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా గ్రీవియన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వివిధ పోలీసు స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న 5 మంది పోలీసు సిబ్బంది వారి ట్రాన్స్ఫర్, మెడికల్ గ్రౌండ్స్, రిక్వెస్ట్ బదిలీల గురించి జిల్లా ఎస్పీకి విన్నవించుకున్నారు.
Similar News
News July 4, 2025
ఖమ్మం: ఆయిల్‌పామ్ సుంకంపై కేంద్రమంత్రికి తుమ్మల లేఖ

ముడి ఆయిల్‌పామ్‌పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. కేంద్రం మే 31న ముడి ఆయిల్‌పామ్‌పై దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించిందని తెలిపారు. దిగుమతి సుంకం తగ్గింపుతో వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించలేమన్నారు. రైతులకు లాభదాయకంగా ఉంటేనే ఆయిల్‌పామ్ సాగుకు ముందుకొస్తారని లేఖలో పేర్కొన్నారు.
News July 4, 2025
ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు: వాతావరణ కేంద్రం

తెలంగాణలో రానున్న 5 రోజులు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉదయం వరకు ADB, ASF, మంచిర్యాల, నిర్మల్, NZB, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, MHBD, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, MBNR జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. అన్ని జిల్లాల్లో గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
News July 4, 2025
HYD: మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ ట్వీట్

మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితుల గురించి మాజీ మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. కేసీఆర్ రొటీన్ హెల్త్ చెకప్‌లో భాగంగా గురువారం ఆసపత్రిలో చేరారన్నారు. బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ మానిటర్ చేయడం కోసం 1, 2రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారని పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్య సమాచారం అడుగుతూ ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.