News December 11, 2025

నంద్యాల జిల్లా మంత్రులకు మీరిచ్చే ర్యాంక్ ఎంత?

image

ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రులకు CM చంద్రబాబు <<18527900>>ర్యాంకులు<<>> ప్రటించిన విషయం తెలిసిందే. NMD ఫరూక్‌కు 3వ, BC జనార్దన్ రెడ్డికి 4వ ర్యాంకు ఇచ్చారు. అత్యధిక ఫైళ్ల (ఫరూక్ 1,512, బీసీ 1,091)ను తక్కువ సమయంలో క్లియర్ చేసినందుకు ఈ ర్యాంకులు పొందారు. అయితే గ్రౌండ్ లెవెల్లో వారి పనితనం ఎలా ఉంది? స్వీకరించిన అర్జీలకు పరిష్కారం చూపుతున్నారా? సీఎం ఇచ్చిన ర్యాంకులను మీరు సమర్థిస్తారా? మీ ర్యాంక్ ఎంత? కామెంట్ చేయండి.

Similar News

News December 17, 2025

ALERT..వీడియో గ్రఫీ,వెబ్‌ కెమెరాల ద్వారా కౌంటింగ్ రికార్డ్: కలెక్టర్

image

మహబూబ్ నగర్ జిల్లాలోని గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను వీడియోగ్రాఫి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని విసి కాన్ఫరెన్స్ హాల్ నుంచి సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవితో కలిసి మూడో విడత ఎన్నికలు జరుగనున్న బాలానగర్ ,జడ్చర్ల, మూసాపేట, భూత్పూర్, అడ్డాకల్ మండలాల అధికారులతో వెబెక్స్ నిర్వహించి సమీక్షించారు.

News December 17, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

* జుక్కల్: మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం
* బాన్సువాడ: పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ చేసిన కలెక్టర్
* బిచ్కుంద: ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి..
* బిక్కనూర్ మండలంలో పెద్దపులి సంచారం
* సదాశివనగర్: ఘనంగా ఎల్లమ్మ పండుగ ఉత్సవాలు
* కామారెడ్డి: నేత్రపర్వంగా కొనసాగుతున్న మల్లికార్జున స్వామి ఉత్సవాలు

News December 17, 2025

KPHB సాయినగర్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

KPHB PS పరిధిలోనీ సాయినగర్‌లోని ఇగ్నైట్ జూనియర్ కాలేజీలో 1st ఇయర్ MPC విద్యార్థి శ్రీకేతన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ హాస్టల్‌లో జరిగిన ఈ దుర్ఘటనపై యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం దాచిపెట్టి మృతదేహాన్ని తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు చేరుకుని యాజమాన్యం వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.