News November 23, 2024

నంద్యాల జిల్లా యువకుడికి 18వ ర్యాంక్

image

నంద్యాల జిల్లా యువకుడు ఆల్ ఇండియా ర్యాంక్‌తో సత్తా చాటాడు. దొర్నిపాడు మండలం రామచంద్రపురం గ్రామనికి చెందిన గడ్డిపాటి నాగరాజు కుమారుడు యశ్వంత్ కుమార్ చెన్నైలోని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు. ఈక్రమంలో ఆయన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్‌(IES) పరీక్ష రాశారు. ఇండియాలోనే 18వ ర్యాంక్ సాధించారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.

Similar News

News November 23, 2024

డ్రోన్ సిటీతో వేల మందికి ఉద్యోగ అవకాశాలు: మంత్రి బీసీ

image

ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటుతో వేల మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన డ్రోన్ పాలసీపై అసెంబ్లీలో ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో సుమారుగా 100 డ్రోన్ కంపెనీలు ప్రారంభించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. తద్వార అనేక మందికి ఉపాధి కల్పించవచ్చని మంత్రి తెలిపారు.

News November 23, 2024

నేటి నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనం నిలిపివేత

image

శ్రీశైల క్షేత్రంలో మళ్లికార్జున స్వామి స్పర్శదర్శనం శని, ఆది, సోమవారాల్లో నిలిపివేసినట్లు దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. శని, ఆది, సోమవారాల్లో క్షేత్రానికి భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో ఈ మూడు రోజుల్లో ఉచిత స్పర్శదర్శన సేవలు నిలిపివేసినట్లు చెప్పారు. తిరిగి మంగళవారం నుంచి శుక్రవారం వరకు యథావిధిగా స్పర్శ దర్శనం సేవలు కొనసాగుతాయని వెల్లడించారు.

News November 23, 2024

రోజా పూల తోటను పరిశీలించిన కలెక్టర్

image

మహానంది మండలం గాజులపల్లెలో రోజా పూల తోటను నంద్యాల కలెక్టర్ రాజకుమారి గణియా పరిశీలించారు. సాగు చేస్తున్న విధానాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. పూల తోట చక్కగా ఉందని రైతును ప్రశంసించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి అధిక దిగుబడులు సాధించి ఆర్థిక ప్రయోజనం పొందాలని కోరారు.