News February 21, 2025

నంద్యాల జిల్లా TODAY TOP న్యూస్ 

image

☞శ్రీశైలం పాతాళ గంగ వద్ద భక్తుల సందడి. ☞ పీఎం కిసాన్ ద్వారా జిల్లాలో 4.5 లక్షల మందికి లబ్ధి. ☞రీ సర్వే గ్రామం(ఎస్.కొత్తపల్లె)ను సందర్శించిన కలెక్టర్. ☞జగన్‌కు Z+ కేటగిరి భద్రత కల్పించాలి: SV మోహన్ రెడ్డి. ☞ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గృహానికి విచ్చేసిన కలెక్టర్. ☞మంగళగిరిలో వినతులు స్వీకరించిన మంత్రి బీసీ. ☞CM అన్న భ్రమలోనే జగన్ ఉన్నాడు: మంత్రి ఫరూక్. ☞డోన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 

Similar News

News July 7, 2025

VR స్కూల్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్

image

నెల్లూరులోని VR మున్సిపల్ స్కూల్‌ను విద్యాశాఖ మంత్రి లోకేశ్ సోమవారం ప్రారంభించారు. ఎంతో చరిత్ర గల ఈ పాఠశాలను ఇటీవల మంత్రి నారాయణ పున:నిర్మించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోకేశ్ పాఠశాలలో మౌలిక వసతులను పరిశీలించారు. పలువురు విద్యార్థులతో సెల్ఫీలు దిగారు. ఈ పాఠశాల పున:నిర్మాణంలో నారాయణ కూతురు షరిణి కీలక పాత్ర పోషించారు. మంత్రి వెంట ఎంపీ వేమిరెడ్డి, కలెక్టర్ ఆనంద్ తదితరులు ఉన్నారు.

News July 7, 2025

NZB: అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గాంధారి నరసింహారెడ్డి

image

నిజామాబాద్ మొదటి జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గాంధారి నరసింహారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని అనంతగిరికి చెందిన నర్సింహారెడ్డి ఇంటర్మీడియట్ విద్యను ఖిల్లా కళాశాలలో, డిగ్రీ, లా ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కోర్టులో సుదీర్ఘకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.

News July 7, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹540 తగ్గి ₹98,290కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹500 తగ్గి ₹90,100 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేట్ రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.