News February 12, 2025
నంద్యాల: టెన్త్ అర్హతతో 37 ఉద్యోగాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739282069131_672-normal-WIFI.webp)
నంద్యాల జిల్లా (డివిజన్)లో 37 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీ వరకు https://indiapostgdsonline.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News February 12, 2025
HYD: మార్చి మొదట్లోనే మామిడి పండ్లు..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739320159734_15795120-normal-WIFI.webp)
HYD శివారులో బాటసింగారం అతిపెద్ద పండ్ల మార్కెట్ మామిడి పండ్ల సీజన్ కోసం సిద్ధమవుతోంది. దాదాపు 19 ఎకరాలకు మించిన స్థలంలో ఈ మార్కెట్ సిద్ధం చేస్తున్నట్లు మార్కెట్ యజమాన్యాలు తెలిపారు. ఇప్పటికే షెడ్లను నిర్మించారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. ఏపీ, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ మహారాష్ట్ర ఉత్తర్‌ప్రదేశ్ నుంచి మన HYDకి ఈసారి మార్చి మొదట్లోనే మామిడి పండ్లు రానున్నాయి.
News February 12, 2025
అనంత: టెన్త్ అర్హతతో 66 ఉద్యోగాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739278281719_672-normal-WIFI.webp)
అనంతపురం జిల్లా (డివిజన్)లో 66 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీ వరకు https://indiapostgdsonline.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News February 12, 2025
నేటి నుంచి ఆధ్యాత్మిక పర్యటన.. బేగంపేట్ చేరుకున్న పవన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739328875777_782-normal-WIFI.webp)
AP Dy.CM పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల ఆధ్యాత్మిక పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఆయన కొద్దిసేపటి కిందట HYDలోని బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయన 4రోజులపాటు కేరళ, తమిళనాడులో పర్యటించనున్నారు. అనంత పద్మనాభ స్వామి, మధురై మీనాక్షి, పరస రామస్వామి, అగస్త్య జీవసమాధి, తదితర ఆలయాలను సందర్శించనున్నారు. ఇటీవల జ్వరం బారిన పడిన పవన్ కోలుకొని ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్తున్నారు.