News June 25, 2024

నంద్యాల: నకిలీ బంగారం పెట్టి.. బ్యాంక్ లోన్

image

నకిలీ బంగారంతో రూ.6.66లక్షల లోన్ తీసుకుని మోసిగించిన ఘటనపై కేసు నమోదైంది. ఎస్సై వరప్రసాద్ వివరాలు..ఉయ్యాలవాడ(M) మాయలూరుకు చెందిన లక్ష్మీనారయణ కోవెలకుంట్ల ముత్తూట్‌ ఫైనాన్స్‌లో 8నకిలీ బంగారు గాజులు తాకట్టుపెట్టి రూ.2.63లక్షలు, సంజామల(M) పేరుసోములకి చెందిన అమీర్ 4గాజులు, కడియం తాకట్టు పెట్టి రూ.3.03లక్షల రుణం తీసుకున్నారు. ఆడిట్‌లో 10శాతం మాత్రమే బంగారం ఉన్నట్లు తేలడంతో మేనేజర్ psలో ఫిర్యాదు చేశారు.

Similar News

News June 29, 2024

సైకిల్‌పై.. అయోధ్య నుంచి మహానందికి

image

ఢిల్లీకి చెందిన రాజేంద్ర శర్మ సైకిల్‌పై మహానందికి చేరుకున్నారు. వస్త్ర దుకాణంలో పనిచేసే ఆయన చిన్నప్పటి నుంచే హిందూ ధర్మం పట్ల ఆకర్షితుడై సైకిల్‌పై సంపూర్ణ భారత్ యాత్ర చేయాలని సంకల్పించాడు. ఈ ఏడాది మార్చి 13న అయోధ్య నుంచి సైకిల్ యాత్ర మొదలు పెట్టాడు. 7 రాష్ట్రాలను దాటుకుంటూ ఏపీకి చేరాడు. అందులో భాగంగా మహానంది చేరుకున్నారు. మహానందీశ్వర స్వామివారిని దర్శించుకుని అహోబిలం, తిరుపతికి వెళ్తానని చెప్పారు.

News June 29, 2024

రూ.1,861 కోట్లను దోచేశారు: ఎంపీ బైరెడ్డి శబరి

image

ప్రజాధనం దుర్వినియోగం చేసిన దోషులను శిక్షించాలని ఎంపీ బైరెడ్డి శబరి ప్రభుత్వాన్ని కోరారు. ‘వైసీపీ పాలనలో ప్రజాధనం ఎంతలా దుర్వినియోగం అయిందో చెప్పేందుకు ఇదొక నిదర్శనం. మాజీ సీఎం జగన్ ప్రచార పిచ్చి కోసం ప్రత్యేకంగా డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏకంగా రూ.1,861 కోట్లను దోచేశారు. ఈ అక్రమాలన్నింటిపై సమగ్ర విచారణ జరిపి ప్రజాధనం దుర్వినియోగం చేసిన దోషులకు శిక్షించాలి’ అని ఆమె ట్వీట్ చేశారు.

News June 29, 2024

ALERT.. నంద్యాల జిల్లాలో నేడు పిడుగులతో కూడిన వర్షాలు

image

అల్పపీడన ద్రోణి ప్రభావంతో నేడు జిల్లాలో వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, చెట్లు, పోల్స్, టవర్స్ కింద ఉండొద్దని సూచించింది.