News March 1, 2025
నంద్యాల నగరంలో భారీ ర్యాలీ

ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజులపాటు మహిళా సాధికారతపై అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
Similar News
News March 1, 2025
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్

ఐపీఎల్ తరహాలో రాష్ట్రంలో తెలంగాణ ప్రీమియర్ లీగ్(TPL) రానుంది. జూన్‌లో ఈ లీగ్‌ను ప్రారంభిస్తామని HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో క్రికెట్ సదుపాయాలను మరింత అభివృద్ధి చేసేందుకు సహకారం ఇవ్వాలని బీసీసీఐని కోరినట్లు పేర్కొన్నారు. ఈ లీగ్ అందుబాటులోకి వస్తే టీమ్స్‌కు ఏ పేర్లు పెడితే బాగుంటాయో కామెంట్ చేయండి?
News March 1, 2025
తాడిపత్రిలో సచివాలయ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ అసహనం

తాడిపత్రి పట్టణంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం పర్యటించారు. పట్టణ పరిధిలోని కృష్ణాపురం టు సచివాలయాన్ని తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పీ- 4 సర్వే ఎలా జరుగుతుందో పరిశీలించారు. మిస్సింగ్ సిటిజన్, చైల్డ్ వితౌట్ ఆధార్ తదితర సర్వేకు సంబంధించి ప్రజలు అందుబాటులో లేకపోవడంతో సచివాలయ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.
News March 1, 2025
కంది: ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

కంది పరిధిలోని ఐఐటీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ఏర్పాట్లను కలెక్టర్ వల్లూరు క్రాంతి ఐఐటీ డైరెక్టర్ మూర్తితో కలిసి శనివారం పరిశీలించారు. 2న ఉపరాష్ట్రపతి పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు, అదనపు కలెక్టర్ మాధురి ,అధికారులు పాల్గొన్నారు.