News April 20, 2024
నంద్యాల: నాడు ప్రత్యర్ధులు.. నేడు మిత్రులు

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు.. తాత్కాలికమే అనే వ్యాఖ్యకు ఈ చిత్రం దర్శనం ఇస్తుంది. రెండు దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్ధులు ఒక్కటాయిన దృశ్యం ఇది. శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డా, ఏరాసు కుటుంబాల మధ్య రాజకీయ పోరు నడిచింది. 1994లో బుడ్డావెంగళరెడ్డి ఏరాసు ప్రతాప్ రెడ్డి పోటీ ప్రారంభమైంది. 1999, 2004, 2009లో పోటీపడ్డగా 3సార్లు కాంగ్రెస్ తరపున ఏరాసు ప్రతాప్రెడ్డి గెలుపొందారు.
Similar News
News December 29, 2025
ప్రజా ఫిర్యాదుల వేదికలో 101 విన్నపాలు

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 101 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా, పలువురు సీఐలు పాల్గొన్నారు.
News December 29, 2025
కర్నూలు: తిరుమల వెళ్లి వస్తుండగా విషాదం

ఒంటిమిట్ట మండలంలోని మట్టంపల్లి-నందలూరు మధ్య ఆదివారం సాయంత్రం పూణే ఎక్స్ప్రెస్ రైలుకింద పడి శ్రీనివాసులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ తెలిపారు. మృతుడు కర్నూలు జిల్లా అప్సరి మండలం శంకరంబాడి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో రైలు నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.
News December 28, 2025
విక్రాంత్ పాటిల్ ప్రస్థానం: ఎస్పీ నుంచి డీఐజీ వరకు

కర్నూలు ఎస్పీగా సేవలు అందిస్తున్న విక్రాంత్ పాటిల్ 2012 బ్యాచ్ తమిళనాడు క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఏపీలో కీలక బాధ్యతలు నిర్వహించి డీఐజీగా పదోన్నతి పొందారు. విజయనగరం అదనపు ఎస్పీగా కెరీర్ ప్రారంభించి చిత్తూరు రైల్వే ఎస్పీగా, విజయవాడ డీసీపీగా సేవలందించారు. పార్వతీపురం, కాకినాడ ఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం కర్నూలు ఎస్పీగా ఉన్న ఆయనకు డీఐజీగా పదోన్నతి లభించడంపై పోలీసు వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.


