News March 24, 2025
‘నంద్యాల నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి’

నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు, నేరచరిత్ర గలవారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు.
Similar News
News November 4, 2025
108 రైస్ మిల్లులు, 234 రైతు కేంద్రాలు సిద్ధం: జేసీ

జిల్లాలో ధాన్యం కొనుగోలుకు మొత్తం 108 రైస్ మిల్లులు, 234 రైతుసేవా కేంద్రాలు సిద్ధం చేశామని జేసీ అభిషేక్ గౌడ సోమవారం తెలిపారు. ఈ ప్రక్రియ వచ్చేవారం నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. జిల్లా లక్ష్యం 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను, ముందస్తుగా 85 లక్షల గోనె సంచులు సిద్ధం చేశామన్నారు. జీపీఎస్ డివైజ్ సిస్టంతో 3,803 వాహనాలను కూడా సిద్ధం చేసినట్లు జేసీ వివరించారు.
News November 4, 2025
మెడికల్ ఎగ్జామినేషన్‌లో ప్రైవసీ

BNS సెక్షన్ 53(2) ప్రకారం, క్రిమినల్ కేసుల వైద్యపరీక్షల సమయంలో ఒక మహిళను వైద్యురాలు లేదా ఆమె పర్యవేక్షణలో మాత్రమే పరీక్షించాలి. సెన్సిటివ్ మెడికల్ ప్రొసీజర్స్‌లో మహిళల కంఫర్ట్, కన్సెంట్, డిగ్నిటీ కాపాడేందుకు ఈ హక్కు కల్పించారు. అలాగే సెక్షన్ 179 ప్రకారం మహిళలను విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు పిలవకూడదు. పోలీసులే ఆమె ఇంటికి వెళ్లాలి. ఆ సమయంలో ఒక మహిళా పోలీసు అధికారి తప్పనిసరిగా ఉండాలి.
News November 4, 2025
అరకు: అవును.. ఇది పాఠశాలే!

అరకులోయ మండలంలోని కొత్తభల్లుగుడ పంచాయతీ పరిధి సూకురుగుడలో పాఠశాల భవనం నిర్మాణం చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. కొన్నేళ్ల క్రితం నిర్మించిన పాఠశాల భవనం శిధిలావస్థకు చేరి కూలిపోయే స్థితిలో ఉంది. దీంతో 40 మంది విద్యార్థులకు నిర్మాణ దశలో ఉన్న అంగన్వాడీ భవనంలోనే ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారని గిరిజనులు సోమవారం తెలిపారు. పాలకులు స్పందించి సూకురుగుడలో పాఠశాల భవనం నిర్మాణం చేపట్టాలన్నారు.


