News April 10, 2025

నంద్యాల: పండ్లు మాగించడంపై అవగాహన

image

అనుమతులున్న పౌడర్లు మాత్రమే వాడి మామిడి పండ్లను మాగించాలని జిల్లా అధికారులు అన్నారు. అందుకు ఏసీ గోడౌన్లను ఉపయోగించుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి నాగరాజు, మార్కెటింగ్ ఏడీఎస్ అబ్దుల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఓ. వెంకట రాముడు, కాసింలు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో నిషేధిత క్యాల్షియం కార్బైడ్ వినియోగంపై బుధవారం పండ్ల వ్యాపారస్తులకు తెలిపారు.

Similar News

News November 10, 2025

సీతారాంపురం గ్రామంలో టిప్పర్‌ బీభత్సం

image

ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున అతివేగంతో దూసుకొచ్చిన ఓ టిప్పర్‌ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్న కుట్టు మిషన్ల యూనిట్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షెడ్లు, యంత్రాలు ధ్వంసమయ్యాయి. తెల్లవారుజాము కావడంతో యూనిట్‌లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణాపాయం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 10, 2025

ఖమ్మం: ఉపాధ్యాయుల హాజరుపై ‘యాప్’ కొరడా!

image

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు కోసం ప్రవేశపెట్టిన FARS యాప్ ఇప్పుడు ఉపాధ్యాయులపై నిఘా పెట్టింది. హాజరు తక్కువ ఉన్న హెచ్‌ఎంలను కలెక్టర్ మందలించారు. సక్రమంగా హాజరుకాని టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. సమయపాలన, సెలవు/ఓడీ అప్‌డేట్‌ యాప్‌లో తప్పనిసరి. ఈ కఠిన నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాలు గుర్రుగా ఉన్నాయి.

News November 10, 2025

నేటి నుంచి గ్రూప్ -3 పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్

image

తెలంగాణలో నేటి నుంచి గ్రూప్-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ఈ నెల 26వరకు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు 2 జిరాక్స్ సెట్లు తీసుకెళ్లాలి.