News March 11, 2026
నంద్యాల: ‘పచ్చని’ ప్రమాదమంటే ఇదే!

నంద్యాల జిల్లాలో విద్యుత్ స్తంభాలకు పలుచోట్ల పిచ్చి మొక్కలు అల్లుకొని ప్రమాదకరంగా ఉన్నాయి. మేత కోసం వెళ్లి జంతువులు మృత్యువాత పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రజలు సైతం ప్రమాదాల బారిన పడ్డారు. వెలుగోడులోని జమ్మి నగర్ సమీపాన రామసముద్రం చెరువు వైపు వెళ్లే ప్రధాన రహదారి పక్కనున్న విద్యుత్ స్తంభం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదకరంగా మారింది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు మీ ప్రాంతంలో ఉన్నాయా? కామెంట్
Similar News
News April 5, 2026
GK: నేషనల్ మారిటైమ్ డే విశేషాలు

* INDలోని సింధియా స్టీల్ నావిగేషన్ కంపెనీకి చెందిన ‘SS లాయల్టీ’ నౌక 1919, APR 5న తొలిసారి ముంబై నుంచి లండన్‌కు బయలుదేరింది.
* ఆ రోజుకు గుర్తుగా ప్రభుత్వం 1964 నుంచి నేషనల్ మారిటైమ్ డేను నిర్వహిస్తోంది.
* దేశ సముద్ర తీరం పొడవు 11,098KM. 12 మేజర్, 217 మైనర్ పోర్టులున్నాయి.
* మొత్తం వాణిజ్యంలో 95% సముద్రాల ద్వారానే జరుగుతోంది.
* ఈ రంగంలో విశేష కృషి చేసిన వారికి ‘సాగర్ సమ్మాన్’ అవార్డులిస్తారు.
News April 5, 2026
సిరిసిల్ల : ఘనంగా ఈస్టర్ డే వేడుకలు

సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు, పలు గ్రామాల్లో ఈస్టర్‌డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసు క్రీస్తును శిలువ వేసిన మూడో రోజు క్రీస్తు(పునరుథ్థానం) తిరిగి వచ్చిన సందర్భంగా వేడుకలను ప్రత్యేక ప్రార్థనల మధ్య జరిపారు. పలువురు నిరుపేదలకు నిత్యవసర సరుకులు, దుస్తులు పంపిణీ చేశారు.
News April 5, 2026
కొలంబియా బిజినెస్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన కేటీఆర్

సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్ లో శనివారం సాయంత్రం నిర్వహించిన 21వ బిజినెస్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధిపై తన అనుభవాలను పంచుకున్నారు. తెలంగాణ పోరాటం, త్యాగాల నుండి పుట్టిందని, కేసీఆర్ సమర్థవంతమైన నాయకత్వంలో ఒక దశాబ్దంలోనే దేశంలోని మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఆయన వివరించారు.


