News March 30, 2025
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

ప్రతి సోమవారం నంద్యాల కలెక్టరేట్‌లో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈనెల 31వ తేదీన రంజాన్ పండుగ సందర్భంగా కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 1, 2025
రేషన్ షాపులను పరిశీలించిన MHBD కలెక్టర్

మహబూబాబాద్ జిల్లాలో అమలవుతున్న సన్న బియ్యం పంపిణీ పథకాన్ని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నేడు పరిశీలించారు. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో రేషన్ దుకాణాలను ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై డీలర్లతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సన్నబియాన్ని సక్రమంగా అందజేయాలని జిల్లా కలెక్టర్ డీలర్లకు సూచించారు.
News April 1, 2025
భూకంపం.. మయన్మార్‌లో 2,719 మంది మృతి

భూకంప విలయానికి మయన్మార్‌లో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 2,719 మంది బాడీలు దొరికినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వారిలో ఐదేళ్లలోపు చిన్నారులు 50 మంది దాకా ఉన్నారని తెలిపాయి. 4,521 మంది గాయపడగా, ఇంకా 441 మంది ఆచూకీ దొరకాల్సి ఉందని పేర్కొన్నాయి. కాగా శిథిలాల కింద మృతదేహాలు వెలికితీయడం ఆలస్యం కావడంతో పలు చోట్ల దుర్వాసన వెలువడుతోంది.
News April 1, 2025
రేపు వైసీపీ నేతలతో జగన్ భేటీ

AP: ఇటీవల రాష్ట్రంలో జరిగిన MPP, జడ్పీ ఉపఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలతో YCP అధినేత జగన్ భేటీ కానున్నారు. పార్టీ విజయం కోసం సహకరించిన వారిని స్వయంగా అభినందించనున్నారు. కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, కేసులతో కూటమి ఇబ్బంది పెట్టినా పార్టీ కోసం వీరంతా అంకితభావంతో పనిచేశారని YCP నేతలు చెబుతున్నారు. పలు జిల్లాల MPTC, ZPTCలు, పార్టీ మండల అధ్యక్షులు, కో-ఆప్షన్ సభ్యులు ఈ భేటీలో పాల్గొంటారు.