News December 19, 2025
నంద్యాల: ఫొటోల మార్ఫింగ్.. ఇద్దరు మహిళల అరెస్ట్

కోవెలకుంట్ల, సంజామల, రేవనూరు, ఆళ్లగడ్డ పరిధిలోని పోలీసు అధికారుల ఫొటోలు అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు సీఐ ఎం.రమేశ్ బాబు తెలిపారు. ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్న వారి సమాచారం తెలియడంతో బందెల స్పందన, బందెల మారతమ్మను కోవెలకుంట్లలో అరెస్ట్ చేశామన్నారు. మార్ఫింగ్‌కు వాడుతున్న రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Similar News
News December 21, 2025
నేడే పల్స్ పోలియో.. నిర్లక్ష్యం చేయకండి

AP: నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ కచ్చితంగా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. 38,267 బూత్‌ల ద్వారా 54,07,663 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయనున్నారు. తప్పని పరిస్థితుల్లో ఇవాళ మిస్ అయితే రేపు, ఎల్లుండి కూడా వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ న్యూస్ షేర్ చేసి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ను అలర్ట్ చేయండి.
News December 21, 2025
ధనుర్మాసం: ఆరో రోజు కీర్తన

‘‘తెల్లవారింది, పక్షులు కిలకిలారావాలు చేస్తున్నాయి. స్వామి ఆలయంలోని శంఖధ్వని నీకు వినబడలేదా? పూతనను, శకటాసురుని సంహరించిన ఆ శ్రీకృష్ణుడే పాలకడలిపై శయనించిన శ్రీమన్నారాయణుడు. మునులు, యోగులు భక్తితో చేస్తున్న ‘హరి! హరి!’ నామస్మరణతో మేమంతా మేల్కొన్నాము. కానీ నువ్వు ఇంకా నిద్రిస్తున్నావేంటి? ఓ గోపికా! వెంటనే మేల్కొను. మాతో కలిసి ఆ స్వామి వ్రతంలో పాల్గొని మోక్షాన్ని పొందుదాం, రా!’’ <<-se>>#DHANURMASAM<<>>
News December 21, 2025
PDPL: ఓవర్సీస్ స్కాలర్షిప్స్.. JAN 19 LAST DATE

ముఖ్యమంత్రి ఓవర్సీస్ పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యకు స్కాలర్‌షిప్/ఆర్థిక సహాయం కోసం అర్హులైన మైనారిటీ విద్యార్థులు 2026 JAN 19లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నరేశ్ కుమార్ నాయుడు తెలిపారు. FEB 20లోపు సర్టిఫికెట్ల జిరాక్స్‌తో దరఖాస్తులను జిల్లా కార్యాలయంలో సమర్పించాలన్నారు. కుటుంబ ఆదాయం రూ.5లక్షలలోపు ఉండాలి. ఎంపికైతే రూ.20లక్షల సహాయం, విమాన ఛార్జీలు అందుతాయి.


