News April 13, 2025
నంద్యాల: బాదంపప్పుపై ఆంజనేయ స్వామి చిత్రం

నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ హనుమాన్ జయంతి సందర్భంగా.. బాదంపప్పుపై ఆంజనేయస్వామి చిత్రాన్ని చిత్రీకరించాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాదంపప్పుపై హనుమంతుడు చిత్రాన్ని చిత్రీకరించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని మోసుకు వస్తున్న రూపంలో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, వారి ప్రతిభను ప్రముఖులు ప్రత్యేకంగా కొనియాడారు.
Similar News
News October 31, 2025
‘మొంథా’ తుపాను నష్టంపై నివేదిక: డీఏవో

మొంథా తుపాను కారణంగా మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న పంటల ప్రాథమిక నష్టం నివేదికను ప్రభుత్వానికి పంపించామని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు సేకరించిన వివరాల ప్రకారం.. జిల్లాలో మొత్తం 16,617 ఎకరాల్లో వరి, 8,782 ఎకరాల్లో పత్తి, 565 ఎకరాల్లో మిర్చి, 65 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టపోయినట్లు నివేదిక రూపొందించామని పేర్కొన్నారు.
News October 31, 2025
NLG: రూ.కోట్లల్లో పేరుకుపోయిన బకాయిలు

బకాయిల వసూళ్ల విషయంలో నల్గొండ మున్సిపల్ రెవెన్యూ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. రూ.కోట్లలో రావాల్సి ఉన్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా పనిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో ఈ ఏడాది ఆస్తి పన్ను రూ.9.30 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇకపోతే పాత బకాయిలు రూ. 33.80 కోట్లు ఉన్నాయి. మొత్తంగా రూ.43.11 కోట్లు ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి.
News October 31, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు!

బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ.1,22,680కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.1,100 ఎగబాకి రూ.1,12,450గా ఉంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ. 1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే ధరలున్నాయి.


