News June 13, 2024

నంద్యాల: బాలికపై చిరుత పులి దాడి

image

నంద్యాల- గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్డులోని చలమ వద్ద 12 ఏళ్ల బాలిక పాండే‌పై చిరుతపులి దాడి చేసిన ఘటన గురువారం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కూలీల కుటుంబాలు, రైల్వే పనులు చేస్తుండగా ఒక్కసారిగా చిరుత బాలికపై దాడి చేసిందని సాటి కూలీలు తెలిపారు. వారందరూ కేకలు వేయడంతో చిరుత పులి అక్కడనుంచి పారిపోయిందన్నారు. గాయపడిన బాలికను రైల్వే అధికారులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Similar News

News October 2, 2024

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థికి మెడిసిన్ సీటు

image

బనగానపల్లెలోని మంగళవారం పేటకు చెందిన సలాం, నాయుమున్నిసా దంపతులు కుమారుడు కలీమ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన ఫేస్-2 ఫలితాల్లో మెడిసిన్ సీటు సాధించారు. దీంతో కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో అతనికి సీటు దక్కింది. కలీమ్ తల్లి SGT ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, తండ్రి స్వర్ణకారుడిగా పని చేస్తున్నారు. కాగా, కలీమ్ GOVT జూనియర్ కళాశాలలో చదివి సీటు సాధించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

News October 1, 2024

సీఎం స‌మ‌క్షంలో హామీ ఇచ్చిన మంత్రి టీజీ భ‌ర‌త్

image

క‌ర్నూలు జిల్లాలో త్వ‌ర‌లోనే ట‌మోటా ప్రాసెసింగ్ యూనిట్ నెల‌కొల్పుతామ‌ని రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ చెప్పారు. పత్తికొండ మండలం పుచ్చ‌కాయ‌ల‌మ‌డలో సీఎంతో క‌లిసి ప్ర‌జావేదిక కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గొన్నారు. ఆయ‌న‌ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ట‌మోటా పంట‌ను ఎక్కువ‌గా సాగు చేస్తార‌న్నారు. యూనిట్ నెల‌కొల్పేందుకు ఉన్న వివాదాల‌ను త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని సీఎం స‌మ‌క్షంలో చెప్పారు.

News October 1, 2024

జాతీయ స్థాయి పోటీలకు పత్తికొండ విద్యార్థి ఎంపిక

image

పత్తికొండ ఏపీ మోడల్ స్కూలు సీఈసీ రెండో ఏడాది విద్యార్థి బోయ తేజేశ్వర్ రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-19 పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని కళాశాల ప్రిన్సిపల్ విక్టర్ శామ్యూల్, పీడీ రాజశేఖర్ నాయక్ తెలిపారు. విద్యార్థిని కళాశాల బృందం అభినందించింది.