News March 13, 2025
నంద్యాల: బొలెరోతో ఢీకొట్టి.. చోరీ

బేతంచర్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జస్వంత్ నంద్యాలలో బైక్‌ను కొనుగోలు చేసి బేతంచర్లకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో తమ్మరాజు పల్లె ఘాట్ వద్ద దుండగులు జస్వంత్ బైకును బొలెరోతో ఢీ కొట్టారు. జస్వంత్ కిందపడిపోగా అతని చేతికి ఉన్న 4 తులాల బ్రేస్‌లెట్, 2 ఉంగరాలను బొలెరోలో వచ్చిన ముగ్గురు దొంగలు దోచుకున్నారు. ఘటనపై పాణ్యం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 14, 2025
గుంటూరులో గుండె జబ్బు నిర్ధారించే యాప్

ఆటలాడే వయసులో సిద్ధార్థ్ అనే 14ఏళ్ల బాలుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సిర్కాడివీయా యాప్ రూపొందించి అద్భుతం సృష్టించాడు. డల్లాస్‌కు చెందిన సిద్ధార్థ్ MP పెమ్మసాని సహకారంతో యాప్ ద్వారా GGHలో గుండె జబ్బు నిర్ధారణ పరీక్షలు చేశారు. 500 మందికి పరీక్షలు నిర్వహించగా 10 మందికి గుండె జబ్బు ఉందని యాప్ పసిగట్టింది. GGH సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి సిద్ధార్థ్‌ని అభినందించారు.
News March 14, 2025
BREAKING: పరిగి-కొడంగల్ రోడ్డులో యాక్సిడెంట్

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పరిగి పట్టణ సమీపంలోని కొడంగల్ వెళ్లే రోడ్డులో రైస్ మిల్ సమీపంలో నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 14, 2025
పెద్దాపురం: బలవంతపు పెళ్లిపై పోలీసులకు బాలిక ఫిర్యాదు

పెద్దాపురంలో 9వ తరగతి చదువుతున్న బాలిక (14)కు నిడదవోలకు చెందిన యువకుడి(28)తో బలవంతంగా పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధపడ్డారు. రేపు(15న) నిశ్చితార్థం కూడా పెట్టేశారు. అయితే తాను పెళ్లి చేసుకోనని, చదువుకుంటానని బాలిక చెప్పింది. అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చిన వారు వినలేదు. దీంతో బాలిక గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ వి.మౌనిక కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు