News April 10, 2025
నంద్యాల: మత్తు పదార్థాలను నియంత్రించాలి

నంద్యాల జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు సహకరించి పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు తెలిపారు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో కోఆర్డినేషన్ కమిటీతో నిర్వహించిన సమావేశంలో అధికారులకు సూచనలు చేశారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నియంత్రణ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొందని చెప్పారు.
Similar News
News November 6, 2025
ఇదేం నిబంధన.. ‘7 క్వింటాళ్ల పరిమితిపై’ రైతుల ఆవేదన

ఖమ్మం: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి సేకరణలో ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి విధించడంపై ఉమ్మడి జిల్లా రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన ‘దిక్కుమాలిన నిబంధన.. ఏడ్చినట్టే ఉంది’ అని రైతులు మండిపడుతున్నారు. తేమశాతం, పింజ పొడవు నిబంధనలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతుండగా, ఎక్కువ దిగుబడి వస్తే ఎక్కడ అమ్ముకోవాలని వారు సీసీఐ అధికారులను ప్రశ్నిస్తున్నారు.
News November 6, 2025
గన్నవరం: ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల నుంచి ఎంపికైన 52 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తొలిసారి విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. దీంతో చిన్నారులు భావోద్వేగానికి లోనయ్యారు. సమగ్ర శిక్షా, ఏపీ సైన్స్ సిటీ సంయుక్తంగా చేపట్టిన మూడు రోజుల సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో భాగంగా జాతీయ మ్యూజియం, ప్లానెటోరియం సందర్శిస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో అభినందించారు.
News November 6, 2025
అమలాపురం: 8న డీఆర్‌సీ సమావేశం

జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్‌సీ) సమావేశం అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో శనివారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ గురువారం తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్న నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని వెల్లడించారు. అన్ని శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు తమ శాఖలకు సంబంధించిన సమాచారంతో సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆదేశించారు.


