News November 19, 2024

నంద్యాల మాజీ ఎమ్మెల్యే సెటైరికల్ ట్వీట్

image

నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవికిశోర్ రెడ్డి సెటైరికల్ ట్వీట్ చేశారు. జనాభాను పెంచే ఉద్దేశ్యంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సవరణ బిల్లుకు శాసన సభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ‘స్థానిక సంస్థల అర్హత నిబంధనల్లో సడలింపు చేస్తే జనాభా పెరుగుతుంది అంటా’ అంటూ శిల్పా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

Similar News

News December 3, 2024

కర్నూలు: సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా

image

కర్నూలు జిల్లాలో ఎల్లుండి నుంచి జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లకు సమాచారం పంపిన ప్రభుత్వం.. తదుపరి నోటిఫికేషన్ జారీ తేదీని త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది. కాగా, కొద్దిరోజులుగా తుఫాన్‌, భారీ వర్షాల నేపథ్యంలో సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

News December 3, 2024

సాగునీటి సంఘం ఎన్నికల్లో అన్ని చోట్లా వైసీపీ పోటీ: ఎమ్మెల్యే విరుపాక్షి

image

సాగునీటి సంఘం ఎన్నికలపై దృష్టి సాధించాలంటూ ఎమ్మెల్యే విరుపాక్షి పేర్కొన్నారు. మంగళవారం ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల వైసీపీ కార్యాలయంలో ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. అన్నిచోట్లా వైసీపీ అభ్యర్థులు పోటీలో ఉంటారని ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

News December 3, 2024

మల్లన్న సన్నిధిలో నిలుపుదల చేసిన సేవలు ఇవే!

image

శ్రీశైల మల్లన్న సన్నిధిలో దర్శనాల్లో పలు సేవలను నిలుపుదల చేస్తూ దేవస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీస్వామివారి గర్భాలయ అభిషేకం (రూ.5000), ఉదయాస్తమాన సేవ (రూ.1,01,116), ప్రాతఃకాల సేవ (రూ.25,116), ప్రదోషకాల సేవ (రూ.25,116), సామూహిక అభిషేకము (రూ.1500), శ్రీస్వామివారి స్పర్శదర్శనం (రూ.500), వీఐపీ బ్రేక్ (రూ.500), అమ్మవారి ముఖమండపంలో కుంకుమ పూజలను నిలుపుదల చేశారు.