News December 11, 2025

నంద్యాల మీదుగా వెళ్లే రైలుకు బోగీల పెంపు

image

నంద్యాల మీదుగా ప్రయాణించే గుంటూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీల్లో మార్పు చేశారు. గతంలో 19 బోగీలతో ఉన్న ఈ రైలు ఇక నుంచి 24 బోగీలతో ప్రయాణించనుంది. ఇందులో ఒక సెకండ్ ఏసీ, మూడు థర్డ్ ఏసీ, 14 స్లీపర్, నాలుగు జనరల్ బోగీలు ఉంటాయి. ఈ సౌకర్యం ఈ నెల 18 నుంచి తిరుపతి వైపు రైలుకు, 19 నుంచి గుంటూరు వైపు రైలుకు అందుబాటులోకి రానుంది.

Similar News

News December 12, 2025

రాజమండ్రి: 9 రైస్ మిల్లర్లకు షోకాజ్ నోటీసులు

image

తూ. గో జిల్లాలో ఖరీఫ్ 2024–25 ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అనధికార వసూళ్లు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై 9 రైస్ మిల్లర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు జేసీ మేఘా స్వరూప్ ప్రకటించారు. అనపర్తి, బిక్కవోలు, చాగల్లు, కడియం, కోరుకొండ మండలాలకు చెందిన మొత్తం 9 రైస్ మిల్లులు అనధికార వసూళ్ల ఆరోపణలపై ధాన్యం/రైస్ అలాట్‌మెంట్ నిలిపివేత, మిల్లులను బ్లాక్‌లిస్ట్ చేయడం వంటి చర్యలు చేపడుతున్నట్లు
జేసీ తెలిపారు.

News December 12, 2025

కొండంత లక్ష్యం.. నంబర్-3లో అక్షర్ పటేలా?

image

SA 2వ T20లో 214 పరుగుల భారీ లక్ష్యం ముందు ఉంచితే, IND జట్టు ఫాలో అయిన స్ట్రాటజీ వింతగా ఉందని క్రీడా వర్గాలు విమర్శిస్తున్నాయి. గిల్ తొలి ఓవర్లోనే ఔటైతే SKYకి బదులు అక్షర్ నం.3లో రావడమేంటని ప్రశ్నిస్తున్నాయి. సూర్య కాకపోయినా తిలక్, హార్దిక్, జితేశ్‌ ఉండగా ఈ మూవ్ ఏంటో అంతుచిక్కడం లేదని అభిప్రాయపడుతున్నాయి. తొలి బంతి నుంచే తడబడిన అక్షర్ 21బంతుల్లో 21పరుగులే చేసి వెనుదిరిగారు. దీనిపై మీ COMMENT.

News December 12, 2025

ప్రకాశం: మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం.. పదేళ్ల జైలు శిక్ష.!

image

మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ఒంగోలు 2వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి గురువారం తీర్పునిచ్చారు. ఒంగోలుకు చెందిన నారాయణ మతిస్థిమితంలేని మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టు 2021లో ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. విచారణ అనంతరం న్యాయస్థానం నేడు నిందితుడికి శిక్ష విధించింది. పోలీసులను SP హర్షవర్ధన్ రాజు అభినందించారు.