News November 16, 2025
నంద్యాల: మొక్కజొన్న రైతు కుదేలు

నంద్యాల జిల్లాలో మొక్కజొన్నకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేయగా ఎకరాకు రూ.25వేలు పెట్టుబడి పెట్టామన్నారు. ప్రకృతి సహకరించకపోవడంతో దిగుబడి ఎకరాకు 20 క్వింటాలే వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటా రూ.1800లకు కొనుగోలు చేసేందుకు ఎవరూ రావటం లేదంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
Similar News
News November 16, 2025
రేపు కార్తీక మాసం చివరి సోమవారం.. ఏం చేయాలంటే?

కార్తీక మాసం చివరి సోమవారం శివుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ‘ఉదయాన్నే స్నానం చేయాలి. శివాలయానికి వెళ్లి బిల్వ పత్రాలు సమర్పించాలి. నీళ్లు/పాలు, పెరుగు, తేనె, గంగాజలంతో అభిషేకం చేయించాలి. 365 వత్తులతో దీపాలు వెలిగించాలి. ఉపవాసం ఉండి అన్నదానం, వస్త్రదానం చేయాలి. ఆవుకు ఆహారం పెట్టాలి. దీనివల్ల ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది’ అని పేర్కొంటున్నారు.
News November 16, 2025
రాష్ట్రపతి CP రాధాకృష్ణన్‌ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో ఉప రాష్ట్రపతితో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఉప రాష్ట్రపతిని సత్కరించారు. గవర్నర్ రాజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ విందులో సీఎంతో పాటు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
News November 16, 2025
ఫుట్‌బాల్ రాష్ట్రస్థాయి టోర్నీ.. మెదక్ జట్టుకు తృతీయ స్థానం

పాఠశాల క్రీడా సమాఖ్య(ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో నల్గొండలో ఈనెల 14 నుంచి 16 వరకు జరిగిన రాష్ట్రస్థాయి అండర్-17 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా బాలుర జట్టు తృతీయ స్థానం సాధించింది. మూడో స్థానం కోసం రంగారెడ్డితో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియగా, పెనాల్టీ షూటౌట్‌లో మెదక్ జట్టు 4-3 స్కోరు తేడాతో విజయం సాధించిందని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు.


