News December 25, 2025
నంద్యాల: రూ.8వేల మద్దతు ధరతో కొనుగోలు

నంద్యాల జిల్లాలో నాఫెడ్ ద్వారా రూ.8వేల మద్దతు ధరతో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు. జిల్లాలో 1.17 లక్షల ఎకరాల్లో 70,562 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రస్తుతం 25,200 టన్నుల కొనుగోలుకు అనుమతులు వచ్చాయని, డీసీఎంఎస్, సహకార సంఘాల ద్వారా ఈ సేకరణ జరుగుతుందని వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News December 26, 2025
కేయూ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు 940మంది రిజిస్ట్రేషన్

కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశాలు ఈనెల 27, 28 తేదీల్లో హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 4న ప్రారంభమైన ఈ ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి పూర్వ విద్యార్థులు తరలివస్తుండగా 940 మంది రిజిస్ట్రేషన్ చేశారు. 27న ప్రారంభ సమావేశం, 28న పూర్వ విద్యార్థుల సమావేశం, ముగింపు కార్యక్రమం నిర్వహిస్తారు.
News December 26, 2025
హనుమకొండ: భార్య గొంతు కోసిన భర్త

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పరకాల మండలం మలకపేట సోషల్ వెల్ఫేర్ స్కూల్లో అటెండర్‌గా పనిచేస్తున్న మంద అనూష(35)ను ఆమె భర్త రవి కత్తితో గొంతు కోసిన ఘటన చోటు చేసుకుంది. అనూషను స్థానికులు హనుమకొండ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 26, 2025
NRPT: అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ బదిలీ

నారాయణపేట అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)గా విధులు నిర్వహించిన సంచిత్ గంగ్వార్‌ను GHMC మల్కాజ్ గిరి జోనల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్‌గా పని చేస్తున్న నారాయణ్ అమిత్ మాలెంపాటిని నారాయణపేటకు బదిలీ చేశారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ సెలవులో ఉండటంతో సంచిత్ గంగ్వార్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరించారు.


