News February 24, 2026
నంద్యాల: రైతులను తిప్పలు పెడుతున్న పర్ఫాల్ స్వాపెన్ పక్షులు

విదేశీ పక్షులతో నంద్యాల జిల్లాలోని వరి రైతులు బెంబేలెత్తుతున్నారు. రబీ సీజన్‌లో రైతులు వరి నాట్లు విస్తారంగా వేశారు. అయితే పర్ఫాల్ స్వాపెన్ జాతికి చెందిన విదేశీ పక్షులు నాట్లను పీకేస్తూ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పోర్ఫిరియో ఇండికస్, ఆగ్నేయ ఆసియా నుంచి వచ్చిన ఈ పక్షులు చిత్తడి నేలల్లో జీవిస్తాయి. వరి, జమ్ము బెరడులను తిని బతికే ఈ పక్షులు వరి పంటను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు.
Similar News
News February 26, 2026
తణుకు: కేబుల్ వైరు మెడకు తగిలి.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

సిబ్బంది నిర్లక్ష్యం ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. తణుకు మండలం తేతలి వద్ద బుధవారం రాత్రి బైకుపై వెళ్తున్న వడ్లూరుకు చెందిన రాంబాబు మెడకు ఇంటర్నెట్ కేబుల్ వైర్లు చుట్టుకున్నాయి. మరమ్మతులు చేస్తున్న సమయంలో సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యలు ఆరోపించారు. మెడ భాగంలో గాయాలైన రాంబాబును చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News February 26, 2026
పోలవరం: రిజర్వాయర్‌లో మునిగి వృద్ధురాలు మృతి

గంగవరం మండలం మొల్లేరు గ్రామానికి చెందిన కృష్ణవేణి బుధవారం సూరంపాలెం రిజర్వాయర్‌లో పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ వెంకయ్య మీడియాకు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. గత కొంత కాలంగా మతిస్తిమితం లేకుండా ఉంటున్న ఆమె పలు మార్లు ఇంటి నుంచి వెళ్లి పోవడం, కుటుంబ సభ్యులు వెతికి ఇంటికి తీసుకురావడం జరిగేదని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News February 26, 2026
NIT వరంగల్‌లో 39 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

NIT వరంగల్‌లో 39 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ/బీటెక్, డిప్లొమా, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఇంటర్, టెన్త్, ఐటీఐ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, ST, PwBDలకు రూ.1000. స్క్రీనింగ్/స్కిల్/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitw.ac.in/


