News January 23, 2025
నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వృద్ధుడు మృతి

నంద్యాల రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు నంద్యాల రైల్వే ఎస్సై అబ్దుల్ జలీల్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఫ్లాట్‌ఫామ్ నంబర్2 వద్ద వ్యక్తి మృతి చెందినట్లు చెప్పారు. మృతుడు కాషాయపు వస్త్రాలు ధరించాడని, సుమారు 60 ఏళ్లు ఉంటాయన్నారు. మృతి చెందిన వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఆచూకీ తెలిస్తే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News November 10, 2025
టైక్వాండో పోటీల్లో కర్నూలు విద్యార్థుల విజయం

రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ టైక్వాండో పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ డా. ఏ. సిరి అభినందించారు. కడప జిల్లా రైల్వే కోడూరులో జరిగిన అండర్–19 విభాగంలో సుగందిని వెండి, ఇంద్రాణి కాంస్య పతకాలు గెలిచారు. ఏలూరులో జరిగిన అండర్–17 విభాగంలో లేఖ్యశ్రీ చందన వెండి, నక్షత్ర, రేవంత్ కాంస్య పతకాలు సాధించారు. క్రీడాకారులను ప్రోత్సహించిన కోచ్ షబ్బీర్ హుస్సేన్‌ను కలెక్టర్ అభినందించారు.
News November 10, 2025
కర్నూలు జిల్లాలో పలు ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు

ఈ నెల 11న కర్నూలు జిల్లాలో పలు ప్రాజెక్టులకు వర్చువల్‌గా సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ సిరి ఆదేశించారు. దీనిపై సంబంధిత అధికారులతో ఆమె ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఏపీఐఐసీ, విమానాశ్రయం, పర్యటక శాఖలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 10, 2025
కర్నూలు: డయల్ యువర్ APSPDCL సీఎండీ

ఇవాళ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ APSPDCL సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ ఆదివారం వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా కర్నూల్, నంద్యాల జిల్లాలలోని విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చన్నారు. 8977716661 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.


