News September 15, 2024
నంద్యాల విద్యార్థికి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్’లో చోటు

నంద్యాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థి హావీస్ తన ప్రతిభతో ఏకంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. రమేశ్, స్వర్ణ దంపతుల కుమారుడు హావీస్ ప్రముఖ చిత్రకారుడు కోటేశ్ వద్ద చిత్రకళలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో ఆయన పోట్రేయిట్ చిత్రాన్ని 3 గంటల్లో 3,022 చిన్న బొట్టు బిళ్లలను అతికిస్తూ తయారు చేశాడు. హవీస్‌కు సంస్థ ప్రతినిధులు ప్రశంసా పత్రాన్ని అందించారు.
Similar News
News November 13, 2025
కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో విస్తృత తనిఖీలు

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీ జె.బాబు ప్రసాద్ నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. సీఐలు, ఎస్సై, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. బస్టాండ్‌లో అనుమానిత వ్యక్తులు, వాహనాలు, పార్సిల్ కార్యాలయాలను పోలీసులు పరిశీలించారు.
News November 13, 2025
వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు 2026-27కు అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా సమాచార అధికారి కె.జయమ్మ తెలిపారు. గత అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈనెల 30తో ముగుస్తుందన్నారు. కొత్త దరఖాస్తులు రేపటి నుంచి https://mediarelations.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు.
News November 13, 2025
మందు బాబులకు కర్నూలు ఎస్పీ హెచ్చరిక

కర్నూలు జిల్లాలో బహిరంగంగా మద్యం తాగి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రోడ్లు, నడక దారులు, పార్కులు, వ్యాపార సముదాయాల వద్ద ప్రజా జీవనానికి ఆటంకం కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.


