News December 30, 2025
నంద్యాల: విషాదం.. తల్లి, కుమార్తె మృతదేహాలు లభ్యం

గడివేముల మండలంలోని ఉండుట్ల గ్రామానికి చెందిన లక్ష్మీదేవి తన ఇద్దరు పిల్లలతో ఈనెల 28న ఎస్సార్‌బీసీ కాలువలో దూకిన ఘటనలో మంగళవారం విషాదం నెలకొంది. ఎస్సై నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన గాలింపు చర్యల్లో లక్ష్మీదేవి, ఆమె కుమార్తె వైష్ణవి మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే, నాలుగు నెలల చిన్నారి సంగీత ఆచూకీ ఇంకా లభించలేదని పోలీసులు తెలిపారు. చిన్నారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Similar News
News January 2, 2026
5 బిల్లులు.. MGNREGAపై స్వల్పకాలిక చర్చ

TG: అసెంబ్లీలో ఇవాళ చేపట్టే బిజినెస్ కార్యక్రమాలను కార్యదర్శి తిరుపతి ప్రకటించారు. ముందుగా ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఆపై BAC రిపోర్ట్‌ను CM రేవంత్ ప్రవేశపెడతారు. మంత్రి ప్రభాకర్ రవాణా, BC వెల్ఫేర్ గెజిట్ నోటిఫికేషన్ పత్రాలు సభకు సమర్పిస్తారు. మున్సిపల్, GHMC ACT సవరణ, ప్రైవేటు వర్సిటీలు, మోటార్ వెహికల్ టాక్సేషన్ చట్ట సవరణ బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. MGNREGAపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది.
News January 2, 2026
ఉమ్మడి వరంగల్‌లో రూ.48 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు!

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31న ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు రూ.48 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ నూతన సంవత్సరాని ఆహ్వానించే వేడుకల్లో మద్యం ప్రియులు రికార్డు స్థాయిలో మద్యం కొనుగోలు చేశారు. జిల్లాలో 134 బార్/ రెస్టారెంట్, 295 వైన్సుల ద్వారా కొనుగోలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
News January 2, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


