News April 5, 2024
నంద్యాల: వైసీపీకి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ రాజీనామా

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలానికి చెందిన వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఓబుల్ రెడ్డిగారి బాలిరెడ్డి శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు, ఎమ్మెల్యే కాటసానికి పంపించినట్లు తెలిపారు. కొంతకాలంగా ఎమ్మెల్యే, పార్టీ తీరుపై బాలిరెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఈయన త్వరలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 13, 2025
నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జోహార్ నవోదయ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. ఆరో తరగతి ప్రవేశం కోసం ఈ పరీక్షను నిర్వహించారు. జిల్లాలో మొత్తం 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6,469 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, 4,548 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు వివరించారు.
News December 13, 2025
కర్నూలు: ఆటో కొనివ్వలేదని సూసైడ్

నంద్యాల(D) బ్రాహ్మణకొట్కూరుకు చెందిన రామాంజనేయులు(30) ఆత్మహత్య చేసుకున్నాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఈయన.. కొంతకాలంగా మద్యానికి బానిసై పనికి వెళ్లలేదు. ఆటో నడుపుతానని, కొనుగోలుకు డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేశాడు. మద్యం మానితే కొనిస్తామని చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 2న కల్లూరు(M) పందిపాడు సమీపంలో పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కేసు నమోదైంది.
News December 13, 2025
ప్రపంచ దేశాలు మోదీ పాలన వైపు చూస్తున్నాయి: టీజీ వెంకటేశ్

నేడు ప్రపంచ దేశాలు మోదీ పాలన వైపు చూస్తున్నాయని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. శుక్రవారం కర్నూలులోని అటల్-మోదీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కర్నూలు రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూస్తే మనకు బీజేపీ సహకారం ఎలా ఉందో కర్నూలు ప్రజలకు అర్థమవుతుందన్నారు. మంత్రి టీజీ భరత్ కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నందున కార్యక్రమానికి రాలేకపోయారని తెలిపారు.


