News May 2, 2024
నంద్యాల: వైసీపీని వీడిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు.. టీడీపీలో చేరిక..!

నంద్యాలకు చెందిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుడు డాక్టర్ రవికృష్ణ వైసీపీని వీడారు. గురువారం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను దారికి తెచ్చే సామర్థ్యం చంద్రబాబుకే ఉందని రవికృష్ణ తెలిపారు.
Similar News
News July 7, 2025
కర్నూలు: నీటి పారుదల సలహా మండలితో కలెక్టర్ సమావేశం

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఖరీఫ్ (2025-26) పంటలకు నీటి విడుదలకు సంబంధించి జిల్లా నీటి పారుదల సలహా మండలితో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు నీటి కొరత ఉండకుండా చేయాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యేలు పార్థసారథి, బొగ్గుల దస్తగిరి, గౌరు చరిత, జేసీ,సబ్ కలెక్టర్ ఉన్నారు.
News July 7, 2025
ఆదోని: సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్

ఆదోనిలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రజా గ్రీవెన్స్‌కు వచ్చిన ఆయా గ్రామాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు. డీఎల్డీఓ బాలకృష్ణారెడ్డి, డీఎల్పీఓ తిమ్మక్క, డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
News July 6, 2025
కర్నూలు డీసీసీ ఇన్‌ఛార్జిగా లక్ష్మీ నరసింహ యాదవ్

కర్నూలు డీసీసీ ఇన్‌ఛార్జిగా నంద్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహ యాదవ్‌ను అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అంబటి రామకృష్ణ యాదవ్ స్థానంలో డీసీసీగా లక్ష్మీ నరసింహ యాదవ్‌ను నియమించడం పట్ల రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.