News April 13, 2025
నంద్యాల: 14న జరిగే కార్యక్రమం రద్దు

ఈనెల 14వ తేదీ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సెలవు రోజు కావడంతో నంద్యాల కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి, జిల్లా ప్రజలు వ్యయ ప్రయాసాలు కూర్చి ఎవరు రావద్దన్నారు.
Similar News
News September 17, 2025
ADB: రాంజీ గోండ్.. అడవిలో అడుగులేసిన విప్లవం

బ్రిటిష్, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన వీరుడు రాంజీ గోండ్. ఆయన 1857 భారత స్వాతంత్ర్య సంగ్రామం కంటే ముందే నిర్మల్, ఆదిలాబాద్ అటవీ ప్రాంతాల్లో గిరిజనులను సమీకరించి, స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అటవీ హక్కులను కాలరాస్తున్న పాలకులకు వ్యతిరేకంగా ఆయన గెరిల్లా యుద్ధం నడిపారు. 1860లో బ్రిటిష్ సైన్యాలు రాంజీ గోండ్, ఆయనతో పాటు దాదాపు 1000 మంది అనుచరులను పట్టుకొని నిర్మల్‌లోని ఒక మర్రిచెట్టుకు ఉరితీశారు.
News September 17, 2025
నిజాం హింసలకు సాక్ష్యం రాయికల్ ఠాణా

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్‌లో ఉన్న పాత పోలీస్ ఠాణా, నిజాం కాలంలో జరిగిన హింసలకు నిలువెత్తు సాక్ష్యం. దొరలు, రజాకార్ల చిత్రహింసలకు ఈ భవనం వేదికగా నిలిచింది. ఇనుప చువ్వల గదులు, ఇనుప మంచాలతో రూపొందించిన ఈ బందీఖానాలో పోరాట యోధులను చిత్రవధ చేశారు. ఈ భవనంపై ప్రజలు అనేకసార్లు దాడులు చేసి నిజాంను ఎదిరించారు. నేటికీ చెక్కుచెదరకుండా ఉన్న ఈ భవనం నాటి చరిత్రకు గుర్తుగా నిలుస్తోంది.
News September 17, 2025
రజాకార్లపై రాములపల్లి ప్రజల పోరాటం

తెలంగాణ విమోచన పోరాటంలో భాగంగా 1947లో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాములపల్లి, ఎలబోతారం గ్రామాల ప్రజలు రజాకార్లపై తిరుగుబాటు చేశారు. భూలక్ష్మి అమ్మవారి గద్దె వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, ప్రాణాలైనా ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆగస్టు 12న హుజురాబాద్ వద్ద జరిగిన పోలీసు కాల్పుల్లో ముగ్గురు అమరులయ్యారు. దీంతో ఆగ్రహించిన ఉద్యమకారులు ఒడిసెలు, రాళ్లతో దాడి చేసి ఒక పోలీసు అధికారిని హతమార్చారు.