News September 11, 2024

నంద్యాల: 63 రోజులుగా కనిపించని బాలిక ఆచూకీ

image

పగిడ్యాల మండలం ముచ్చుమర్రి బాలిక ఆచూకీ 63 రోజులైనా తెలియకపోవడం దారుణమని ఎంవీఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులి కొండన్న ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి నంద్యాల మండలం హెచ్.కొట్టాల, కానాల, ఎం.చింతకుంట, తదితర గ్రామాల్లో పర్యటించి వాల్మీకి యువతతో సమావేశమయ్యారు. ముచ్చుమర్రి బాలిక హత్యాచారానికి గురైందని తెలిసి 63 రోజులైనా ఎటువంటి ఆనవాళ్లూ దొరకలేదని, ఈ ఘటనను అధికారులు పూర్తిగా వదిలేశారని వాపోయారు.

Similar News

News November 4, 2025

జిల్లా అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లా అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులనున ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి పీజీఆర్ఎస్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్, తాగునీరు, శానిటేషన్, వ్యవసాయం తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రతి శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి, ప్రజా సేవల నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు.

News November 3, 2025

13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

image

13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ తెలిపారు. అక్టోబర్ 25న లీప్ యాప్‌లో అటెండెన్స్ మార్కు చేయని కారణంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం 13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News November 3, 2025

గ్రామాల్లో నీటి సమస్య ఉండకూడదు: కలెక్టర్

image

గ్రామాల్లో ఎక్కడా నీటి సమస్యలు ఉండకూడదని కలెక్టర్ డా.ఏ.సీరి ఆర్ డబ్ల్యుూఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి ఆమె పలు అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. రెవెన్యూ శాఖ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.