News December 20, 2025

నంద్యాల: ALL THE BEST హసీనా, అంకిత

image

రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలో నంద్యాల జిల్లా క్రీడాకారులు హసీనా, అంకిత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి కోచింగ్‌కు ఎంపికయ్యారు. శిక్షణలో మంచి ప్రతిభ కనబరిస్తే వారిని జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక చేస్తారని స్పాన్సర్ వసుంధర దేవి తెలిపారు. నంద్యాల జిల్లా నుంచి వీరిద్దరే ఎంపిక కావడం గొప్ప విషయం అన్నారు. చదువులో రాణిస్తూనే క్రీడల్లోనూ ప్రతిభ చూపడం హర్షణీయమన్నారు.

Similar News

News December 21, 2025

100% విద్యార్థులు స్కూల్‌కి రావాలి: కలెక్టర్

image

బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాఠశాలల్లో వంద శాతం విద్యార్థుల హాజరు పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సమీక్షలో 10వ తరగతి 100‑రోజుల ప్రణాళికను అమలుచేయాలని, అలాగే “తల్లికి వందనం” పథకం పెండింగ్ అంశాలను పూర్తిచేయాలని సూచించారు. సమీక్షలో డీఈఓ శ్రీనివాస్, డీఎల్‌డీఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.

News December 21, 2025

బాలీవుడ్ నటి నోరా ఫతేహీ కారుకు ప్రమాదం

image

బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ పెద్ద రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ముంబైలో ఓ మ్యూజిక్ ఈవెంట్‌కు వెళ్తున్న ఆమె కారును అంబోలీలోని లింక్ రోడ్‌లో మద్యం మత్తులో ఓ వ్యక్తి కారుతో వేగంగా ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నోరాకు స్వల్ప గాయాలు కాగా వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.

News December 21, 2025

బ్రహ్మాస్త్రం తయారీ.. ఉపయోగించే విధానం

image

వేప, సీతాఫలం, పల్లేరు, ఉమ్మెత్త ఆకులను మెత్తగానూరి ముద్దలా తయారు చేయాలి. ఒక పాత్రలో 10 లీటర్ల ఆవు మూత్రం, ఆకుల ముద్దను వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మూతపెట్టి బాగా ఉడికించి పొయ్యి మీద నుంచి దించి.. 48 గంటల పాటు చల్లారనివ్వాలి. తర్వాత గుడ్డతో వడకడితే బ్రహ్మాస్త్రం సిద్ధమైనట్లే. ఎకరాకు 100 లీటర్ల నుంచి 2 లేదా రెండున్నర లీటర్ల బ్రహ్మాస్త్రం కలిపి పిచికారీ చేయాలి. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.