News January 22, 2026
నంద్యాల: Night view అదరహో!

శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రం రాత్రి వేళ విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతోంది. బుధవారం రాత్రి చిత్రీకరించిన రమణీయ దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుండటంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు. ఈ అద్భుతమైన రాత్రి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఓం నమఃశివాయ!
Similar News
News January 22, 2026
బీఈడీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ బీఈడీ నాలుగో సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకట బసవరావు గురువారం విడుదల చేశారు. మొత్తం 144 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, కేవలం 28 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ https://rayalaseemauniversity.ac.in లో చూసుకోవచ్చని ఆయన సూచించారు.
News January 22, 2026
60 రోజుల్లోపు చార్జ్ షీట్ దాఖలు చేయాలి: జిల్లా ఎస్పీ

కర్నూలు జిల్లాలో నేరాల నియంత్రణకు సాంకేతికతను సమర్థంగా వినియోగించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మహిళల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ మద్యపానంపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేస్తూ, పోక్సో కేసుల్లో 60 రోజుల్లోపు చార్జ్ షీట్ దాఖలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
News January 22, 2026
క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలి: కలెక్టర్

సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. గురువారం కర్నూలు కలెక్టరేట్ నుంచి అంగన్వాడీ కేంద్రాలు, ఇరిగేషన్ అంశాలకు సంబంధించి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌పై సంబంధిత శాఖల జిల్లా అధికారులలో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు వసతి గృహాలను తనిఖీ చేయాలన్నారు.


