News December 16, 2025
నంద్యాల SP పరిష్కార వేదికకు 107 ఫిర్యాదులు

నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 107 ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫిర్యాదులపై విచారణ జరిపి చట్ట పరిదిలో సత్వర న్యాయం అందిస్తామని తెలిపారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా సివిల్ కేసులు, ఆస్తి తగాదాలు ఉన్నాయన్నారు.
Similar News
News December 16, 2025
కదిరి వాసి OG దర్శకుడికి పవన్ కళ్యాణ్ అదిరే గిఫ్ట్

OG దర్శకుడు సుజీత్‌కు సినీ హీరో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదిరిపోయే బహుమతి ఇచ్చారు. కదిరి ప్రాంత నివాసి అయిన సుజిత్‌కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కానుకగా అందజేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ సుజీత్ ఆనందం వ్యక్తం చేశారు. బాల్యం నుంచి పవన్ అభిమానిని అయిన తాను గిఫ్ట్ పొందినందుకు ఆనందంగా ఉందన్నారు.
News December 16, 2025
విధ్వంసక ప్లేయర్.. రూ.కోటికే ముంబైకి

సూపర్ ఫామ్‌లో ఉన్న సౌతాఫ్రికా విధ్వంసక ఓపెనర్ క్వింటన్ డికాక్‌ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. రూ.కోటి బేస్ ప్రైస్‌కు వేలంలోకి వచ్చిన అతడిని అదే ధరకు కొనుగోలు చేసింది. ఇతడు గతంలోనూ ముంబై తరఫున ఆడారు. మరోవైపు స్పిన్ ఆల్ రౌండర్ వనిందు హసరంగను రూ.2 కోట్లకు లక్నో, బెన్ డకెట్‌ను రూ.2 కోట్లకు ఢిల్లీ సొంతం చేసుకున్నాయి.
News December 16, 2025
పకడ్బందీగా 100 రోజుల కార్యాచరణ: కలెక్టర్

ఈ నెల 6న ప్రారంభమైన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై కలెక్టరేట్‌లో కలెక్టర్ లక్ష్మీశ విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి, జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలను పకడ్బందీగా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. కౌన్సిలింగ్‌తో పాటు మోటివేషన్ తరగతులు కూడా నిర్వహించాలన్నారు.


