News August 4, 2024
నంబర్ ప్లేట్లపై ఫలానా తాలూకా అని రాస్తే కేసులే: ఎస్పీ హెచ్చరిక

ద్విచక్ర వాహనాల నంబర్ ప్లేట్లపై ‘వాళ్ల తాలూకా… వీళ్ళ తాలూకా’ అంటూ రాయవద్దని, అలా రాయడం నిబంధనలకు విరుద్ధమని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని స్పీకర్ ఆలయంలో ఆయన మాట్లాడుతూ.. ఏవైనా అనుకోని ప్రమాదాలు, దొంగతనాలు జరిగిన సమయంలో ఇలా రాయడంతో అనేక సమస్యలు ఎదురవుతాయన్నారు. అటువంటి బైక్‌లపై చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News March 4, 2026
ప్రకాశం: తౌషిక్ మృతి.. పాఠశాలకు షోకాజ్ నోటీస్

ప్రకాశం(D) S.కొండ చైతన్య పాఠశాలలో ఇటీవల 6వ తరగతి విద్యార్థి తౌషిక్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్ త్రిసభ్య కమిటీతో విచారణకు ఆదేశించారు. కమిటీ పాఠశాలను సందర్శించి అనేక లోపాలను గుర్తించింది. నివేదికను పరిశీలించిన DEO రేణుకకు ఇవ్వగా ఆమె పాఠశాల యాజమాన్యానికి మంగళవారం షోకాజ్ జారీచేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల గుర్తింపును ఎందుకు రద్దు చేయరాదో తెలపాలన్నారు.
News March 4, 2026
కలెక్టర్‌ను కలిసిన MP మాగుంట, MLA జనార్దన్

ఒంగోలు MLA జనార్దన్, MP మాగుంట శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబును కలెక్టరేట్‌లో కలిశారు. నియోజకవర్గ అభివృద్ధిపై వారు చర్చించారు. ఒంగోలులో నెలకొన్న సమస్యలను జనార్దన్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. పార్లమెంట్ పరిధిలోని సమస్యలను మాగుంట వివరించారు. కలెక్టర్ పరిష్కార దిశగా ప్రయత్నిస్తానని తెలిపారన్నారు.
News March 3, 2026
వెలుగొండ నిర్వాసితులకు న్యాయం ఏది..?

వెలుగొండ ప్రాజెక్టు కింద ముంపుకు గురైన గ్రామాల నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలో 11 గ్రామాలు ముంపుకు గురికానుండగా.. పెద్దారవీడు మండలంలోని సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల గ్రామాల పరిస్థితి దయనీయంగా ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు.


