News October 29, 2024

నకరికల్లు: గొప్ప మనసు చాటుకున్న వృద్ధురాలు

image

నకరికల్లు మండలం కమ్మవారిపాలెంకు చెందిన నరిశెట్టి రాజమ్మ సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలోని పలు సమస్యల గురించి సీఎంకు వివరించారు. తమ గ్రామంలో ఇళ్లు లేని వారు ఉన్నారని, వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. 15 మందికి ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తే, వాటికి తగిన భూమి ఇస్తానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా రాజమ్మను సీఎం అభినందించారు.

Similar News

News November 7, 2025

GNT: రచనలను, ఉద్యమాలే ఆయన జీవిత ధ్యేయం

image

ప్రముఖ అభ్యుదయ సినీ రచయిత, ప్రజా కళాకారుడు, కమ్యూనిస్టు నాయకుడు బొల్లిముంత శివరామకృష్ణ నవంబర్ 27, 1920 సంవత్సరంలో ఉమ్మడి గుంటూరు జిల్లా చదలవాడలో జన్మించారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో రచనలను, ఉద్యమాలను తన జీవిత ధ్యేయంగా మార్చుకున్నారు. ఆయన రచనల్లో తెలంగాణ సాయుధ పోరాటం, సామాజిక అన్యాయాలు, రైతుల కష్టాలు స్పష్టంగా కనిపిస్తాయి. సినీ రచయితగా ‘నిమజ్జనం’కి జాతీయ అవార్డు లభించాయి.

News November 6, 2025

GNT: పత్తి రైతుల సందేహాల కోసం హెల్ప్‌లైన్

image

జిల్లాలో గురువారం నుంచి CCI పత్తి కొనుగోళ్లను ప్రారంభించింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేశారు. పత్తిలో తేమ 8% మించకపోతే, రైతులకు పూర్తి కనీస మద్దతు ధర (MSP) లభిస్తుందని అధికారులు తెలిపారు. ఆరబెట్టిన పత్తిని మాత్రమే కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం రైతులు 7659954529 హెల్ప్‌లైన్ నంబర్‌ సంప్రదించాలని సూచించారు.

News November 6, 2025

GNG: ఓటర్ల జాబితాపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

image

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అన్నారు. ఓటరు జాబితా పునశ్చరణపై గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ను సి.ఈ.ఓ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంటింటా ఓటర్ల సర్వే విచారణ జరపాలన్నారు. బిఎల్‌ఓలు ఇంటింటా సర్వే చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బుక్ కాల్ విత్ బిఎల్‌ఓ అవకాశాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.