News December 25, 2025

నకిరేకల్‌లో తప్పిపోయిన సూర్యాపేట బాలిక.. చివరికి..!

image

సూర్యాపేటకు చెందిన ఓ బాలిక ఆమె తల్లితో పాటు సూర్యాపేట వెళ్తున్న క్రమంలో తల్లికి తెలియకుండా నకిరేకల్‌లో ప్రధాన కూడలి వద్ద దిగింది. చూసుకోకుండా ఆమె ఉన్న వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. పాప ఏడ్చుకుంటూ అక్కడే తిరుగుతుండగా అక్కడ ఉన్నవారు గమనించి నకిరేకల్ పోలీస్ స్టేషన్‌కి తీసుకురావడంతో SI వీరబాబు డీటెయిల్స్ కనుక్కొని సంబంధించిన వారికి తెలియపరచి, తల్లిదండ్రులకు అప్పగించారు.

Similar News

News January 2, 2026

సూర్యాపేట: రాజకీయ కక్షలతో వేధిస్తున్నారు: మత్స్యకారులు

image

మూడు దశాబ్దాలుగా చింతపాలెం మండలం పులిచింతల నదిని నమ్ముకుని జీవిస్తున్న తమను ఆంధ్రకు వెళ్లాలంటూ వేధిస్తున్నారని రేబల్లె మత్స్యకారులు కలెక్టరేట్‌లో మొరపెట్టుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొందరు కుట్రపూరితంగా తమ లైసెన్సులపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం తమ పొట్ట కొట్టవద్దని, అధికారులు స్పందించి రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.

News January 2, 2026

జీవీఎంసీ స్థాయి సంఘంలో 109 అంశాలకు ఆమోదం

image

జీవీఎంసీలో శుక్రవారం స్థాయి సంఘం సమావేశం నిర్వహించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన 109 అంశాలకు ఆమోదం తెలిపారు. సమావేశంలో ప్రధాన అజెండాలో 87 అంశాలు, 52 టేబుల్ అజెండా అంశాలతో పాటు మొత్తం 139 అంశాలు పొందుపరచగా, వాటిని స్థాయి సంఘం సభ్యులు క్షుణ్ణంగా చర్చించి వివిధ కారణాలు వలన 30 అంశాలు వాయిదా వేశారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి సుమారు రూ.26.46 కోట్ల అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపారు.

News January 2, 2026

టెట్‌ కేంద్రాల వద్ద 163 సెక్షన్‌ అమలు: సూర్యాపేట ఎస్పీ

image

సూర్యాపేట జిల్లాలో ఈనెల 3 నుంచి 20 వరకు జరిగే టెట్‌ పరీక్షల నేపథ్యంలో కేంద్రాల వద్ద 163 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో గుంపులుగా ఉండొద్దని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. ఎలాంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదని, పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.