News September 13, 2025
నకిరేకల్‌లో విద్యార్థినికి లైంగిక వేధింపులు..!

నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్న మామిడి శ్రీనివాస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ టీచర్ విద్యార్థినిని వేధిస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఈ విషయం బయటపడింది. ఈ విషయాన్ని బయటపెట్టకుండా రాజీ చేసేందుకు కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రయత్నించినట్లు తెలిసింది. బాధితురాలి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News April 13, 2026
ఆసిఫాబాద్: ఇదే స్ఫూర్తి కొనసాగించేలా ప్రణాళికలు

ఫలితాల్లో ఆసిఫాబాద్ జిల్లా రాష్ట్రస్థాయిలో మెరుగైన ప్రదర్శన చేసింది. ఫస్టియర్‌లో 9వ ర్యాంకు (66.68%), సెకండియర్‌లో ఏకంగా 3వ ర్యాంకు (82.16%) సాధించి సత్తా చాటింది. వెనుకబడిన జిల్లాలో ఇంతటి ప్రతిభ ఎలా సాధ్యమైందనే కోణంలో అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇదే ఉత్సాహాన్ని వచ్చే ఏడాది కూడా కొనసాగించాలని, ఇక్కడ అనుసరించిన బోధనా పద్ధతులను మరింత పకడ్బందీగా అమలు చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది.
News April 13, 2026
మంచిర్యాల: ర్యాంకుల్లో వెనుకడుగు.. లోపం ఎక్కడ..?

మంచిర్యాల జిల్లా ఇంటర్ ఫలితాల్లో వెనుకడుగు వేసింది. ఫస్టియర్‌లో 21వ ర్యాంకు (60.31%), సెకండియర్‌లో 19వ ర్యాంకు (71.63%) సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో ఉత్తీర్ణత తగ్గడంపై విచారణ చేస్తున్నారు. అధ్యాపకుల కొరత ప్రభావంపై అంచనా వేస్తూ, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చేలా, ఇంప్రూవ్మెంట్ లో మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
News April 13, 2026
1,055 ఉద్యోగాలకు నోటిఫికేషన్

సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 1,055 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మైనింగ్ సర్దార్-577, డి.సర్వేయర్-43, అసిస్టెంట్ ఫోర్‌మెన్-435 ఉద్యోగాలున్నాయి. జాబ్‌ను బట్టి టెన్త్, మైనింగ్/ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, డిగ్రీ, సర్వేయర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్, వయసు 18-30ఏళ్లు ఉండాలి. CBT ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ నెల 15 నుంచి మే 14 వరకు అప్లై చేసుకోవచ్చు.
సైట్: https://secl-cil.in/


