News October 15, 2024
నకిరేకల్-నాగార్జున సాగర్ హైవేకు నిధుల విడుదల

నల్గొండ జిల్లా అభివృద్ధిపై కేంద్రం ఫోకస్ చేసింది. నకిరేకల్-నాగార్జున సాగర్ మధ్య హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 14 కి.మీ. మేర 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.516 కోట్లు రిలీజ్ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. గుంటూరు-నల్లపాడు మధ్య రూ.98 కోట్లతో 4 లైన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News September 16, 2025
బాలికపై అత్యాచారం.. నల్గొండ కోర్టు సంచలన తీర్పు

నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నాలుగో తరగతి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 60 ఏళ్ల ఊశయ్యకు 24 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి రోజా రమణి తీర్పు చెప్పారు. రూ.40 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
News September 16, 2025
నల్గొండ: అంగన్వాడీ టీచర్ల పోరుబాట

సమస్యల సాధన కోసం అంగన్వాడీ టీచర్లు పోరుబాట పట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 4 వేలకు పైగానే అంగన్వాడి టీచర్లు ఉన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రూ.18 వేల వేతనంతో పాటు పీఎఫ్ అమలు చేయాలని కోరుతూ ఈనెల 25న చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు. అక్టోబర్ 8న రాష్ట్ర సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రాల్లో పాదయాత్ర, 17 నుంచి ఆన్లైన్ సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు.
News September 16, 2025
రేపు నల్గొండలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

నల్గొండలో పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ దినోత్సవాల సందర్భంగా ఉదయం 10 గంటలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.