News December 9, 2025

నకిలీ కాల్ సెంటర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణరావు నకిలీ కాల్ సెంటర్ల మోసాలపై ప్రజలను అప్రమత్తం చేశారు. తెలియని కస్టమర్ కేర్ నంబర్లను నమ్మవద్దని, అధికారిక వెబ్‌సైట్లలోనే వివరాలు చూడాలని సూచించారు. ఓటీపీ, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పరాదని స్పష్టం చేశారు. మోసపోయిన వారు వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.

Similar News

News December 12, 2025

మలయప్పస్వామి గురించి మీకు తెలుసా?

image

తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో మలయప్ప స్వామిని ఊరేగించారని వార్తల్లో వింటుంటాం. అయితే ఈయన కూడా శ్రీవారే. మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో కలిసి అన్ని రకాల ఉత్సవాలు, ఊరేగింపులు, బ్రహ్మోత్సవాలలో భక్తులకు దర్శనమిస్తారు. గర్భగుడిలోని మూలమూర్తి స్థిరంగా ఉండగా, భక్తులను కటాక్షించడానికి వారి వద్దకు కదులుతూ వచ్చే స్వామియే మలయప్పస్వామి. మలయప్పకోన అనే ప్రాంతంలో స్వయం వ్యక్తంగా ఈ విగ్రహాలు లభించాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 12, 2025

ఐదు దేశాలతో ‘C5’కు ప్లాన్ చేస్తున్న ట్రంప్

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐదు శక్తిమంతమైన దేశాలతో ‘C5’ అనే కొత్త వేదికను ఏర్పాటు చేయనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అమెరికా, రష్యా, చైనా, భారత్, జపాన్‌లతో ఈ గ్రూప్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ధనిక, ప్రజాస్వామ్య దేశాలకే పరిమితమైన ‘G7’కు భిన్నంగా, కోర్ ఫైవ్ (C5) దేశాలు ఇందులో ఉంటాయి. తద్వారా యూరప్ ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News December 12, 2025

తండ్రి ప్రేమ అంటే ఇదే❤️

image

కొడుకు భవిష్యత్తు కోసం ఓ తండ్రి చేసిన సాహసం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఢిల్లీ నుంచి ఇండోర్‌కు వెళ్లే ఇండిగో విమానం రద్దవడంతో కొడుకు 12th పరీక్ష మిస్సవుతుందనే ఆందోళనతో ఆ తండ్రి ప్రత్యామ్నాయం ఎంచుకున్నారు. రాత్రంతా మేల్కొని 800kms స్వయంగా కారు నడిపారు. కొడుకు పరీక్ష సజావుగా రాశాకనే ఆ తండ్రి మనసు కుదుటపడింది. పిల్లల కోసం తండ్రి ఏ త్యాగానికైనా సిద్ధపడతారని ఈ ఘటనే నిరూపించింది.