News January 25, 2025
నకిలీ నోట్ల ముఠా పట్టుకున్న సిబ్బందికి నగదు రివార్డు అందించిన సీపీ

కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ నోట్ల ముఠాను పట్టుకొని నిందితుల నుంచి పెద్ద మొత్తంలో అసలు, నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా నిలిచిన కానిస్టేబుల్ శ్యాంరాజ్, హోంగార్డ్ రాజేందర్‌ను సీపీ అంబర్ కిషోర్ ఝా అభినందిచి నగదు రివార్డులను అందజేశారు. విధి నిర్వహణ ప్రతిభ కనబరిచిన సిబ్బంది శాఖ పరమైన గుర్తింపు లభిస్తుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.
Similar News
News September 19, 2025
గుంటూరు రైల్వేస్టేషన్‌లో కొత్త సదుపాయం

రాబోయే పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రయాణికుల కోసం టిక్కెట్ కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. గుంటూరు స్టేషన్‌లో సిబ్బంది ధరించే జాకెట్ల వెనుక భాగాన క్యూఆర్ కోడ్ అమర్చారు. ప్రయాణికులు యూటీఎస్, రైల్ వన్ యాప్ ద్వారా ఆ కోడ్‌ను స్కాన్ చేసి కాగిత రహిత టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. ఇకపై 5KM లోపు ఇంటి నుంచే జనరల్, ప్లాట్‌ఫామ్, సీజన్ టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యం లభిస్తోంది.
News September 19, 2025
గుంటూరు జిల్లా రైతులకు శుభవార్త

గుంటూరు జిల్లాలో రైతుల అవసరాల నిమిత్తం తాజా ఎరువుల సరఫరా జరిగింది. గురువారం రెడ్డిపాలెం రైల్వే స్టేషన్ రేక్ పాయింట్‌కు 330 మెట్రిక్ టన్నుల యూరియా వ్యాగన్ల ద్వారా చేరింది. స్టాక్‌ను ఏడీఏ మెహనరావు ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లాకు వచ్చిన ఈ సరఫరాలో మార్క్‌ఫెడ్‌కు 250 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్లకు 80 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News September 19, 2025
బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ – లక్షణాలు

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి చెట్ల లేత ఆకులు పసుపు పచ్చగా మారతాయి. ఆకుల ఈనెలు వంగి ముడుచుకుపోతాయి. పూత, పిందె, కాయ, పండ్లపై గోధుమ రంగులో ఉంగరాల్లాంటి రింగుల మచ్చలు ఏర్పడతాయి. ఆ రింగు మధ్య బాగం ఆకుపచ్చగా ఉంటుంది. తెగులు సోకిన పూలు.. పిందెగా మారవు. పిందెలు ఎదగవు. కాయలు తొందరగా పండిపోయి మెత్తగా మారి నీరు కారినట్లు అవుతాయి. ఈ మచ్చల వల్ల పండ్లు నాణ్యత కోల్పోయి మార్కెట్‌లో పంటకు సరైన ధర దక్కదు.