News November 13, 2025
నక్కపల్లిలో వెయ్యి ఎకరాల్లో టాయ్ పార్క్

నక్కపల్లి మండలంలోని కారిడార్ భూముల్లో మహిళలకు ఉపాధినిచ్చే టాయ్ పార్కు ఏర్పాటు కానుంది. చైనా తరహాలో ఎకో సిస్టంతో బొమ్మలను తయారు చేసే యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఒక విదేశీ సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం సుమారు వెయ్యి ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, కలెక్టర్ విజయ్ కృష్ణన్‌తో హోంమంత్రి అనిత చర్చించారు.
Similar News
News November 13, 2025
యాదాద్రి: బీసీల ధర్మ పోరాట దీక్షలో ప్రభుత్వ విప్

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీసీల ధర్మ పోరాట దీక్ష కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలని అన్నారు. రిజర్వేషన్లు ఎవరో ఇచ్చే భిక్ష కాదని అది మన హక్కు అని అన్నారు.
News November 13, 2025
కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

కుష్టువ్యాది నిర్మూలన కార్యాక్రమంలో భాగంగా వివిధ శాఖల సమన్వయంతో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి రోగులను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేశారు. జిల్లాను కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో ఈ వ్యాధి గుర్తింపు, నిర్ధారణకు జరిగిన కార్యక్రమంలో అధికారులతో సమీక్షించారు. అనంతరం గోడపత్రికను ఆవిష్కరించారు.
News November 13, 2025
యాదగిరిగుట్ట: కాలేజ్‌ను సందర్శించిన ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రటరీ

యాదగిరిగుట్టలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ సెక్రటరీ భీమ్ సింగ్ సందర్శించారు. ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య విద్యార్థుల ఉత్తీర్ణ శాతం పెంచడానికి ఆదేశించినటువంటి 90 రోజుల ప్రణాళిక గురించి కళాశాలలోని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు .ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మంజుల, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.


