News February 2, 2025

నక్కపల్లి: చెరువులో పడి వ్యక్తి మృతి

image

నక్కపల్లి మండలం మనబాలవానిపాలెం సమీపంలోని చెరువులో అదే గ్రామానికి చెందిన గొర్ల రమణ (42) అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ పడి మరణించినట్లు సీఐ కె.కుమారస్వామి ఆదివారం తెలిపారు. గత నెల 31న రమణ ఇంటి నుంచి బయటకు వెళ్లి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. గ్రామానికి సమీపంలో చర్చి వెనుక ఉన్న చెరువులో అతని మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు.

Similar News

News July 4, 2025

డీహైడ్రేషన్‌‌తోనే విద్యార్థులకు అస్వస్థత: FactCheck

image

సోమందేపల్లి మం. పాపిరెడ్డిపల్లి కస్తూర్బా హాస్టల్‌లో కలుషిత ఆహారంతో 15 మంది అస్వస్థతకు గురైనట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని ప్రభుత్వం పేర్కొంది. ‘విద్యార్థులలో రక్తహీనత నివారణకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వడం ప్రభుత్వ కార్యక్రమం. ఇవి 232 మందికి ఇవ్వగా 15మంది డీహైడ్రేషన్‌కు గురయ్యారు. అస్వస్థతకు కలుషిత ఆహారం కారణం కాదు’ అని ట్వీట్ చేసింది.

News July 4, 2025

జగిత్యాల: ‘జ్వరాలు రాకుండా చర్యలు తీసుకోవాలి’

image

జగిత్యాల కలెక్టరేట్లో గురువారం వైద్య ఆరోగ్య శాఖ యొక్క నెలవారి సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ డెలివరీస్ జరిగేలా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఉండాలని తెలిపారు. ప్రతి రోజు ఆరోగ్య కార్యకర్తలు ఫీవర్ సర్వే నిర్వహిస్తూ మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News July 4, 2025

నల్గొండ: ‘బీఏఎస్ విద్యార్థులపై వివక్ష తగదు’

image

బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థులపై ఆల్ఫా స్కూల్ యాజమాన్యం వివక్షతకు పాల్పడుతోందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున ఆరోపించారు. శుక్రవారం పేరెంట్స్‌తో కలిసి నల్గొండ ఆల్ఫా పబ్లిక్ స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ స్కూల్‌లో దళిత విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారిందని, బుక్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఒంటరిగా కూర్చోబెడుతున్నారన్నారు.