News April 14, 2025

నక్కపల్లి: నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

image

సముద్రంలో సోమవారం అర్ధరాత్రి నుంచి జూన్ 15వ తేదీ వరకు చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధించింది. మత్స్య సంపద వృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా రెండు నెలలకు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తుంది. అనకాపల్లి జిల్లాలో గల తీరప్రాంతాలైన అచ్యుతాపురం, పాయకరావుపేట, పరవాడ, రాంబిల్లి, ఎస్ రాయవరం, నక్కపల్లిలో మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు.

Similar News

News July 5, 2025

ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

image

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం నల్లగుంట్లలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బైరబోయిన వెంకటేశ్వర్లు (36) రాత్రి పీర్ల ఊరేగింపులో ఉండగా ప్రత్యర్థులు గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపారు. అయితే హత్యకు గురైన వ్యక్తి సుమారు నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని హత్య చేశాడు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు కూడా హత్యకు గురయ్యాడు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

News July 5, 2025

సిద్దిపేట: ‘విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి’

image

విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి అన్నారు. గజ్వేల్ పాత సయ్యద్ హాసిమ్ ఇంజినీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను శుక్రవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

News July 5, 2025

రణస్థలం: ఏడో తరగతి బాలికపై అత్యాచారయత్నం

image

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ విశాఖలోని రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను శుక్రవారం తన గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.