News September 10, 2025

నక్కపల్లి స్టీల్ ప్లాంట్ ఏపీకి గర్వకారణం: శ్రీనివాసవర్మ

image

నక్కపల్లిలో ఏర్పాటు చేయబోయే ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏపీకి గర్వకారణంగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బి.శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో మంత్రి కార్యాలయంలో మాట్లాడుతూ.. 17.8 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో 7.3 మిలియన్ టన్నులు, రెండవ దశలో 10.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో పూర్తి చేస్తామన్నారు.

Similar News

News September 10, 2025

అత్తిలిలో నేటి నుంచి ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్ట్

image

అత్తిలి రైల్వే స్టేషన్‌లో బుధవారం నుంచి సర్కార్, తిరుపతి పూరీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగనున్నాయి. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు కూటమి నేతలు అత్తిలి మండలంలో ఆటో ప్రచారం ప్రారంభించారు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగేందుకు గత కొంతకాలంగా చేస్తున్న పోరాటం ఫలించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 4న కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రైలు హాల్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

News September 10, 2025

‘అర్క’ టమాటతో రైతుకు భరోసా

image

టమాటను ఆకుముడత, వడలు తెగులు, ఆకు మాడు తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. వీటి కట్టడికి IIHA బెంగళూరు ‘అర్కరక్షక్’, ‘అర్క సామ్రాట్’, ‘అర్క అబేద్’ హైబ్రిడ్ రకాలను తీసుకొచ్చింది. ‘అర్క రక్షక్’, ‘అర్కసామ్రాట్’లు ఆకుముడత, వైరస్, వడలు తెగులు, తొలి దశలో ఆకుమచ్చ, మాడు తెగుళ్లను తట్టుకొని 140 రోజులలో ఎకరాకు 30-34 టన్నుల దిగుబడినిస్తాయి. ‘అర్క అబేద్’ 140-150 రోజుల్లో 30-32 టన్నుల దిగుబడినిస్తుంది.

News September 10, 2025

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: సంగారెడ్డి ఎస్పీ

image

ఈ నెల 13న జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పంకజ్ పరితోష్ అన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసుల్లో రాజీ చేసుకోవడం వల్ల కక్షలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. క్రిమినల్, సివిల్, ఆస్తి వివాదాలు, కుటుంబ, బ్యాంక్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులను ఈ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు.