News October 11, 2025
నగరంలో అమలు కానీ ‘సింగల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్’

HYD మోజంజాహి మార్కెట్, కాటేదాన్, నాచారం, బేగంబజార్, అమీర్‌పేట్, మల్లాపూర్, బాలానగర్, ప్రాంతాల్లో సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ఏమాత్రం తగ్గటం లేదు. కిరాణా దుకాణాలు, రైతు బజార్లలో ఎక్కడపడితే అక్కడ ఈ కవర్లు దర్శనమిస్తున్నాయి. నగరంలో సుమారు 8,500 టన్నుల గార్బేజీ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా, వీటిలో సుమారు 12 టన్నులకు పైగా ఇవే కనిపిస్తున్నాయి.
Similar News
News October 11, 2025
HYD: BRS VS కాంగ్రెస్ @ సోషల్ మీడియా

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, BRS నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునేందుకు, యువ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు సోషల్ మీడియాను ప్రచార అస్త్రంగా వాడుతున్నారు. ఓ వైపు BRS అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా వారి కూతుళ్లు అక్షర, దిశిర, BRS నేతలు, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో వీడియోలు, రీల్స్‌తో ప్రచారం చేస్తున్నారు.
News October 11, 2025
అనంతపురంలో కిలో టమాటా రూ.19

అనంతపురం శివారులోని కక్కలపల్లి మార్కెట్ యార్డ్‌లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. గరిష్ఠంగా కిలో రూ.19, కనిష్ఠ ధర రూ.10, సరాసరి ధర రూ.14తో అమ్ముడుపోతున్నట్లు రాప్తాడు మార్కెట్ యార్డ్ కార్యదర్శి రూప్ కుమార్ తెలిపారు. మార్కెట్‌కు 1,650 టన్నుల టమాటా వచ్చినట్లు ఆయన తెలిపారు. మరోవైపు ధరలు తగ్గుముఖం పట్టడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.